ఇలాంటి ఫుడ్ తీసుకుంటున్నారా? ఈ క్యాన్సర్ కు వెల్కమ్ చెప్పినట్లే.. అధ్యయనం ఏం చెబుతోంది మరీ?

by Anjali |
ఇలాంటి ఫుడ్ తీసుకుంటున్నారా? ఈ క్యాన్సర్ కు వెల్కమ్ చెప్పినట్లే.. అధ్యయనం ఏం చెబుతోంది మరీ?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ఎంతో మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. క్యాన్సర్ కు ఓ కారణం ఆహార అలవాట్లే కారణమని చెప్పుకోవచ్చు. జీవన శైలిలో మార్పుల కారణంగా మనిషి కేవలం క్యాన్సర్ బారిన మాత్రమే కాకుండా పలు ప్రాణాంతక వ్యాధుల్ని కొనితెచ్చుకుంటున్నాడు. గుండె పోటు, రక్తపోటు, బరువు, డయాబెటీస్ వంటి సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్ వంటి వ్యాధి బారిన పడుతున్నారు. అయితే మహిళల్లో ఈ క్యాన్సర్ రావడానికి ప్లాస్టిక్ కవర్స్ వంటి వాటిల్లో స్టోర్ చేసిన ఫుడ్స్ తీసుకోవడమే ముఖ్య కారణమని ఇప్పటికే పలు అధ్యయనాలు తెలిపాయి.

ప్యాకేజీ ఫుడ్లో 200 రసాయనాలు ఉన్నాయని పరిశోధనలో వెల్లడైంది. ప్యాకెజీ ఫుడ్ వల్ల 80 శాతం వ్యాధులు వస్తున్నాయని అంటున్నారు. ఎందుకంటే అందులో ఉండే రసాయనాలు ఆహారంలోకి వెళ్తాయి. దీంతో ఆ ఆహారాన్ని తిన్నాక శరీరం ప్రభావితం అవుతుంది. ఉదా. చిప్స్, పాల ప్యాకెట్స్, బ్రెడ్ వంటివి. ఇవి క్యాన్సర్, కొలస్టాల్ వంటి వ్యాధుల బారిన పడేస్తాయంటున్నారు నిపుణులు. అలాగే సిగరెట్ మద్యం సేవించే మహిళల్లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed