మొటిమలతో బాధపడుతున్నారా!.. అయితే ఈ ఒక్క జ్యూస్‌తో మీ పింపుల్స్ అన్నీ పరార్

by Kavitha |
మొటిమలతో బాధపడుతున్నారా!.. అయితే ఈ ఒక్క జ్యూస్‌తో మీ పింపుల్స్ అన్నీ పరార్
X

దిశ, ఫీచర్స్: సహజంగా ఆడవారికి అయినా మగవారికి అయినా అందంగా ఉండాలనే కోరిక ఉంటుంది. అయితే వాతావరణంలో చోటు చేసుకునే మార్పులతో పాటు చెడు ఆహారపు అలవాట్లు, రాత్రి ఆలస్యంగా తినడం, నిద్రపోవడం, ఒత్తిడి ఎక్కువగా ఉండడం వంటి కారణాల వల్ల చర్మం ప్రభావితం అవుతుంది. దీంతో ముఖంపై మొటిమలు, మచ్చలు వస్తాయి. అవి తగ్గడం కోసం రకారకాల ఆయిట్‌మెంట్స్ అని, క్రీమ్స్ అని వేలకు వేల డబ్బులు తగిలేస్తూ ఉంటారు. అన్ని డబ్బులు పెట్టిన రిజల్ట్స్ ఉంటాయా అంటే లేదనే చెప్పాలి.

అయితే ఈ మొటిమలు ఒక్కోసారి హార్మోన్ల మార్పుల కారణంగా కూడా వస్తుంటాయి. అలా కనుక వచ్చినట్లయితే కచ్చితంగా మనం తీసుకునే ఆహారాల విషయంలో కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. మనం రోజూ తినే ఆహారం మన ఆరోగ్యం పైనే కాకుండా మన చర్మంపై కూడా ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే జంక్ ఫుడ్, ఆయిల్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల బాడీలో హీట్ ఎక్కువై పింపుల్స్ వచ్చే ఛాన్సేస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాటికి ఎంత దూరం ఉంటే అంత మంచిది. అలాగే కొన్ని రకాల పండ్లు, కూరగాయలు మనకు మేలు చేస్తే.. కొన్ని హాని చేస్తాయి. దాని వల్ల మొటిమలు వస్తాయి. అయితే అలా రాకుండా ఒకవేళ వచ్చిన ఈ జ్యూస్‌తో పింపూల్స్‌ని ఇట్టే తగ్గించుకోవచ్చు. ఇంతకీ ఆ జ్యూస్ వల్ల లాభాలు.. తయారీ విధానం ఇప్పుడు చూద్దాం..

5 ఆరోగ్యకరమైన పదార్థాలతో తయారు చేసే ఈ జ్యూస్‌ను తాగడం వల్ల మీ చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలతోపాటు విటమిన్ కె, సి, ఎ సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల ఈ జ్యూస్ కొల్లాజెన్ ఏర్పడేందుకు సహాయపడుతుంది. కొల్లాజెన్ మన స్కిన్‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది కొత్త కణాలు ఏర్పడేలా చేస్తుంది. అందువల్ల మొటిమలు తగ్గుతాయి. ఇక ఈ జ్యూస్‌ను తరచూ తాగడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

కావలసిన పదార్థాలు:

1) యాపిల్

2) కీర

3) క్యారెట్

4) బీట్‌రూట్

5) దానిమ్మ

తయారీ విధానం:

ముందుగా ఈ జ్యూస్‌ను తయారు చేసేందుకు గాను యాపిల్‌ను కట్ చేసి సీడ్స్ తీసేసి మిక్సీలో వేయాలి. అనంతరం కీరదోస, క్యారెట్‌, బీట్‌రూట్‌లను కట్ చేసి వాటిని కూడా మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. అందులోనే దానిమ్మ గింజలు వేయాలి. ఈ మొత్తం పదార్థాలను మిక్సీ పట్టి జ్యూస్ తీయాలి. అలా రెడీ అయిన ఈ జ్యూస్‌ను కనీసం 21 రోజుల పాటు తాగాల్సి ఉంటుంది. అలా తాగడం వల్ల చర్మ సమస్యలు తగ్గి మొటిమలు అన్ని పోయి ప్రకాశవంత మైనా ఫేస్ మీ సొంతం అవుతుంది.

నోట్: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే దీనిని అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు సంబంధించి ‘దిశ’ ఎటువంటి బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించడం ఉత్తమం.

Advertisement

Next Story

Most Viewed