కాలి మడమలు పగిలాయా?.. ఇలా చేస్తే ఈజీగా తగ్గుతాయ్!

by Javid Pasha |
కాలి మడమలు పగిలాయా?.. ఇలా చేస్తే ఈజీగా తగ్గుతాయ్!
X

దిశ, ఫీచర్స్ : వర్షాకాలంలో కొందరికి కాలి మడమలు పగులుతుంటాయి. రోడ్డుపై నడుస్తున్నప్పుడు, వివిధ కాలిబాటల్లో ప్రవహించే మురికి నీరు లేదా పేరుకుపోయిన బురదకు అరికాళ్లు గురికావడంవల్ల ఇది సంభవిస్తుంది. ఇన్ఫెక్షన్లు ప్రబలి పగుళ్లు ఏర్పడతాయి. పాదాలను పరిశుభ్రంగా ఉంచుకోకపోయినా ఈ సమస్యలు తలెత్తుతాయి. అయితే మడమలు పగిలినప్పుడు కొందరికి నొప్పితోపాటు రక్తం కూడా కారుతుంది. అయితే ఈ ప్రాబ్లం నుంచి బయటపడేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అదెలాగో చూద్దాం.

* కాలి మడమల్లో పగుళ్లతో నొప్పితోపాటు పాదాలు అంద విహీనంగానూ కనిపిస్తుంటాయి. ఈ సమస్య నుంచి బయట పడటానికి గ్లిజరిన్ ఉపయోగపడుతుందని నిపుణులు చెప్తున్నారు. యాంటీ ఇన్‌ఫ్లమేటిక్ లక్షణాలు కలిగి ఉండటంవల్ల పగుళ్లపై దానిని రాస్తే రెండు మూడు రోజుల్లో పూర్తిగా నయం అయ్యే అవకాశం ఉంటుంది.

* మడమలపై గ్లిజరిన్ రాయడానికి ముందు అందులో కొంచెం రోజ్ వాటర్ కూడా కలపాలని, తర్వాత శుభ్రంగా కడిగిన తర్వాతనే పగుళ్లపై అప్లయ్ చేయాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేశాక 20 నుంచి 30 నిమిషాల తర్వాత పాదాలను కడిగి, కాటన్ క్లాత్‌తో తడి ఆరిపోయేలా తుడవాలి. దీంతో క్రమంగా పగుళ్లు తగ్గిపోతాయి.

* తేనె కూడా కాలి మడమల పగుళ్లను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు. ఇది నొప్పి, గాయాలు వంటి సందర్భాల్లో నివారణలో ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందని, ఉత్తమ మాయిశ్చరైజర్‌గా యూజ్ అవుతుందని చెప్తున్నారు. అయితే ఉపయోగించే ముందు కొన్ని గోరు వెచ్చని నీళ్లను బకెట్లో గానీ, టబ్‌లో గానీ తీసుకోవాలి. అందులో తేనె కలిపి, ఆ తర్వాత మీ పాదాలను అందులో ముంచాలి. ఓ 20 నిమిషాల తర్వాత బయటకు తీసి కడగాలి. ఓ మూడు రోజులు ఇలా చేస్తే పగుళ్లు పూర్తిగా నయం అవుతాయి.

* నోట్: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాల విషయంలో ‘దిశ’ ఎటువంటి బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed