లంచ్ తర్వాత ఎసిడిటీ తో బాధపడుతున్నారా.. ? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

by Sumithra |
లంచ్ తర్వాత ఎసిడిటీ తో బాధపడుతున్నారా.. ? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
X

దిశ, ఫీచర్స్ : దాదాపు ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ఎసిడిటీ సమస్యను ఎదుర్కొనే ఉంటారు. మరికొంతమంది మాత్రం ప్రతినిత్యం ఈ సమస్యను ఎదుర్కొంటూనే ఉంటారు. ఇది జీర్ణవ్యవస్థకు సంబంధించిన సాధారణ సమస్య. ఆయిల్, స్పైసీ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల పొట్టలో పిత్తం పెరుగుతుందని, దీని వల్ల ఎసిడిటీ సమస్య వస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల పుల్లటి త్రేనుపు, కడుపులో మంట వంటి సమస్యలు కూడా వస్తాయని చెబుతున్నారు. అయితే ఒక్కోసారి తినే సమయం వల్ల కూడా సమస్య రావచ్చునట.

ఈ రోజుల్లో సరైన జీవనశైలి లేకపోవడంతో ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. సమయానికి ఆహారం తీసుకోకపోతే గ్యాస్‌ సమస్య కూడా వస్తుందట. ముఖ్యంగా మధ్యాహ్నం భోజనం చేసే అలవాటు లేని వారికి ఈ సమస్య తీవ్రంగా ఉంటుందని చెబుతున్నారు. అలాంటి వారికి మధ్యాహ్నం భోజనం తర్వాత కడుపు భారంగా అనిపిస్తుందట.

భోజనం తర్వాత అసిడిటీ..

లంచ్ తర్వాత ఎసిడిటీ సమస్యను ఎదుర్కోవలసి వస్తే ఈ సమస్యల వెనుక గల కారణాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. మధ్యాహ్న భోజనంలో చేసే కొన్ని పొరపాట్ల వల్ల గ్యాస్ సమస్యలు ఎక్కువగా వస్తాయి. చాలా సార్లు ఆహారాన్ని పెద్ద ముద్దలుగా తింటారు. అలా తినడం వలన కడుపులో సులభంగా జీర్ణం కాదు. దాంతో కడుపులో యాసిడ్ ఉత్పత్తి పెరుగుతుంది. దీని కారణంగా ఆమ్లత్వం ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా కారణం..

మధ్యాహ్న భోజనానికి ముందు మధ్యమధ్యలో నీరు తాగడం వల్ల కడుపులోని జీర్ణక్రియ ఎంజైమ్‌లకు హాని కలుగుతుందని నిపుణుల అభిప్రాయం. ఫలితంగా యాసిడ్ రిఫ్లక్స్ సమస్యలు మొదలవుతాయి. కూరగాయలు, ఫైబర్ జీర్ణక్రియకు ఎంతగానో ఉపయోగపడతాయి. మధ్యాహ్న భోజనంలో కూరగాయలను తక్కువగా తీసుకోవడం కూడా అసిడిటీ సమస్యలను కలిగిస్తుంది. అంతే కాకుండా మధ్యాహ్న భోజనం చేసిన వెంటనే నిద్రపోవడం వల్ల కూడా ఎసిడిటీ పెరిగి జీర్ణవ్యవస్థ పై ప్రభావం పడుతుంది. అందుకే ఎసిడిటీని నివారించడానికి జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు.

Advertisement

Next Story