పక్షులను పెంచుతున్నారా.. అయితే ప్రమాదంలో పడ్డట్టే?

by Hamsa |   ( Updated:2023-03-12 17:22:48.0  )
పక్షులను పెంచుతున్నారా.. అయితే ప్రమాదంలో పడ్డట్టే?
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం చాలా మంది జంతు ప్రేమికులు జంతువులతో పాటు కొన్ని ప్రత్యేకమైన అందమైన పక్షులకు పెంచుకుంటున్నారు. వాటిని తమ బిడ్డల్లా భావించి వాటి అలనా పాలనా విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తున్నారు. అయితే పక్షులను ఇంట్లో పెంచుకోవడం వల్ల ప్రమాదకరమైన వ్యాధి బారిన పడే అవకాశం ఉన్నట్లు వైద్యులు హెచ్చరిస్తున్నారు. పక్షుల వల్ల ‘బర్డ్ బ్రీడర్ లంగ్ డిసీజ్’ అనే శ్వాసకోశ సమస్య వస్తుందట.

దీనిని ఏవియన్ హైపర్ సెన్సిటివిటీ న్యూమోనాటీస్ అని పిలుస్తారు. ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయో ఇక్కడ తెలుసుకుందాం. కోళ్లు, పక్షులు విసర్జిత పదార్థాల వల్ల దుమ్ము, ఈకల ద్వారా వ్యాపిస్తుంది. దగ్గు, జ్వరం,ఛాతి బిగుతుగా అనిపించడం, అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ లక్షణాలు ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పక్షులకు, కోళ్లకు దూరంగా ఉండకపోతే వారి ప్రాణాలకే ప్రమాదమని డాక్టర్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి : Health: మానసికంగా అలసిపోయారా?.. ఈ జాగ్రత్తలు తీసుకోండి

Advertisement

Next Story

Most Viewed