- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వీటిని ఫ్రిజ్ మీద పెడుతున్నారా..? ఈ విషయాలు గుర్తుంచుకోండి!
దిశ, ఫీచర్స్ : ఈరోజుల్లో దాదాపు అందరూ ఫ్రిజ్ వాడుతున్నారు. నిత్యావసరాల్లో అదొక భాగమైపోయింది. వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్, కూరగాయలు, పచ్చళ్లు, వివిధ ఆహారాలు నిల్వచేయడానికి ఉపయోగిస్తుంటారు. ఒక విధంగా చెప్పాలంటే అందులో ఇంత ఖాళీ జాగా కూడా వదలకుండా ఏదో ఒక వస్తువు పెట్టేస్తుంటారు. అయితే లోపలే అనుకుంటే పొరపాటే.. కొందరు ఫ్రిజ్‌పైన కూడా ఏదో ఒక వస్తువు పెడుతుంటారు. కానీ ఇలా చేయడం ప్రమాదకరం అంటున్నారు నిపుణులు. ఫ్రిజ్‌పై ఏయే వస్తువులు పెట్టకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
* మొక్కలు : ప్రస్తుతం చాలా మంది రకరకాల ఇండోర్ మొక్కలను ఇండ్లల్లో పెట్టుకుంటున్నారు. చూడ్డానికి అందంగా కనిపిస్తాయని పలువురు ఫ్రిజ్‌పైన పెడుతుంటారు. అయితే ఇలా చేయడంవల్ల మొక్కలతోపాటు ఫ్రిజ్ కూడా త్వరగా పాడయ్యే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ఫ్రిజ్ నుంచి వెలువడే వాయువులే ఇందుకు కారణం.
* ఫిష్ ఆక్వేరియం : కొందరు ఇంటిలో అందం కోసమో, ఆసక్తి మేరకో చిన్న చిన్న ఫిష్ ఆక్వేరియమ్స్ కొంటుంటారు. వీటిని కూడా ఫ్రిజ్ మీద పెడుతుంటారు. ఇది ప్రమాదకరం. దీనివల్ల అందులోని చేపలు త్వరగా చనిపోతాయి.
* మెడిసిన్ : కొన్ని రకాల మెడిసిన్, ఇంజక్షన్‌లు కూలింగ్ ప్రదేశాల్లో భద్రపర్చాల్సి ఉంటుంది. వాటిని ఫ్రిజ్‌లోపల ఓ వైపునకు పెడతారు. కానీ ఫ్రిజ్‌పై పెట్టడం మాత్రం మంచిది కాదంటున్నారు నిపుణులు. ఫ్రిజ్ వేడికి, దాని సిలిండర్ నుంచి వెలువడే వాయువు ప్రభావంతో మందుల పవర్ తగ్గిపోతుంది.
* నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించడం లేదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.