మీరు తరచుగా స్ట్రెస్‌కు గురవుతున్నారా?.. వీటిని తింటే రిలాక్స్ అవ్వొచ్చు!

by Javid Pasha |
మీరు తరచుగా స్ట్రెస్‌కు గురవుతున్నారా?.. వీటిని తింటే రిలాక్స్ అవ్వొచ్చు!
X

దిశ, ఫీచర్స్ : కారణాలేమైనా కొందరు తరచుగా స్ట్రెస్‌కు గురవుతుంటారు. ప్రతి విషయంలోనూ టెన్షన్ పడుతుంటారు. ఇది వారి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. శరీరంలో దీర్ఘకాలంపాటు కొన్ని పోషకాలు లోపించడంవల్ల కూడా ఇలా జరిగే అవకాశం ఉంటుంది. అయితే కొన్ని రకాల ఆహారాలు ఈ సమస్య నుంచి బయట పడేస్తాయి. అవేమిటో చూద్దాం.

ఇటీవల వెలువడిన ఓ అధ్యయనం ప్రకారం... ఒత్తిడి, టెన్షన్ వంటివి తగ్గించడంలో రోజువారీ ఆహారాలు కూడా ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి. అలాంటివాటిలో పెరుగు ఒకటి. ఇందులో ఉండే ప్రోబయోటిక్స్ ప్రేగుల ఆరోగ్యానికి కూడా మంచిది. అంతేకాకుండా స్ట్రెస్ రిలేటెడ్ హార్మోన్ల ఉత్పత్తిని ఇది అడ్డుకుంటుంది. ఇందులోని కాల్షియం కూడా స్ట్రెస్ అండ్ టెన్షన్ రిలీఫ్‌గా పనిచేస్తుంది. డార్క్ చాక్లెట్ కూడా ఒత్తిడిని తగ్గిస్తుందని చెప్తారు.

సన్ ఫ్లవర్ సీడ్స్, బాదం, వాల్‌నట్స్ వంటి గింజల్లో విటమిన్ ఇ, మెగ్నీషియం, ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని వివిధ రూపాల్లో ఆహారంగా ఉపయోగించడంవల్ల ఒత్తిడి తగ్గుతుంది. అరటిపండులో పొటాషియం ఉంటుంది. ఇది బాడీలో బ్లడ్ ప్రెజర్‌ను నియంత్రిస్తుంది. ఇందులో ఉండే విటమిన్ బి6 కూడా ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. బెర్రీల్లో కూడా యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఒత్తిడి, టెన్షన్ నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ప్రతిదానికీ టెన్షన్ పడేవారు వారంలో మూడుసార్లు 10 నుంచి 12 బెర్రీలు తింటే మానసిక స్థితి మెరుగు పడుతుందని నిపుణులు చెప్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed