- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంట్లో సెంటెడ్ క్యాండిల్స్ వెలిగిస్తున్నారా.. హ్యాపీ హార్మోన్స్ రిలీజ్‌తో పాటు..!!
దిశ, వెబ్‌డెస్క్: చాలా మంది ఇళ్లలో క్యాండిల్స్ వెలిగిస్తుంటారు. పార్టీస్ కు, క్యాండిల్ లైట్ డిన్నర్స్ అని, ఇంట్లో పూజ కార్యక్రమాలకు ఇలా క్యాండిల్స్ వెలిగిస్తూనే ఉంటారు. అయితే మార్కెట్‌లో ఎన్నో రకాల క్యాండిల్స్ ఉన్నప్పటికీ సెంటెడ్ క్యాండిల్స్ ను ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తారు. కాగా వీటి వల్ల అనేక లాభాలున్నాయని తాజాగా నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
రొమాంటిక్ మూడ్..
సెంటెడ్ క్యాండిల్స్ వాడినప్పుడు ఇళ్లంతా మంచి వాసనతో నిండిపోతుంది. దీంతో క్రియేటివిటీ పెరుగుతుంది. మూడ్ బాగోలేకపోయినా వెంటనే మూడ్ చేంజ్ అవుతుంది. రూమ్ వెదర్ కూడా మారిపోతుంది. మీ పార్ట్నర్ తో హ్యాపీగా గడిపే సమయంలో సెంటెడ్ క్యాండిల్స్ వెలిగించండి. దీంతో ఇద్దరిలో ఆలోమెటిక్ గా మంచి మూడ్ క్రియేట్ అవుతుంది.
ప్రశాంతమైన నిద్ర..
అలాగే ఈ క్యాండిల్స్ ఒత్తిడి నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి. దీంతో హ్యాపీగా, ప్రశాంతంగా నిద్రపోవడానికి అవకాశం ఉంటుంది. దీని వాసనతో మీ బ్రెయిన్ పనితీరు మెరుగుపడుతుంది. కొత్తగా ఆలోచించుతారు. మనసులోని చెడు ఆలోచనలు కూడా దూరమవ్వడానికి అవకాశాలు ఉన్నాయి.
హ్యాపీ హార్మోన్స్ రిలీజ్..
సెంటెడ్ క్యాండిల్స్ వెలిగించినప్పుడు ఆ వాసనతో హ్యాపీ హార్మోన్స్ విడుదల అవుతాయి. తద్వారా మైండ్ రిలీఫ్ అవుతుంది. ఒక్కసారిగా టెన్షన్స్ అన్ని మాయమైపోతాయి. దీంతో ఆ క్షణాల్ని అందరితో హ్యాపీగా గడుపుతారు. పాజిటివిటీ పెరుగుతుంది కూడా. కాగా సెంటెడ్ క్యాండిల్స్ తో లాభాలు తప్ప నష్టాలు లేవంటున్నారు నిపుణులు.
గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.