- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాత్రిళ్లు లేచి నీళ్లు ఎక్కువగా గుతున్నారా?.. ఇది గుర్తుంచుకోండి!
దిశ, ఫీచర్స్: ప్రతిరోజూ శరీరానికి సరిపడా నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిది. కొన్నిసార్లు ఫుడ్ తినకుండా అయినా ఉండగలం కానీ.. వాటర్ లేకుండా మాత్రం ఉండలేం. అయితే కొందరు పడుకునేముందు కూడా ఫుల్లుగా వాటర్ తాగుతుంటారు. అలాగే మధ్యలో దాహం వేసినప్పుడు తాగేందుకని పక్కన వాటర్ బాటిల్ పెట్టుకుంటారు. మెలకువ వచ్చినప్పుడల్లా తాగుతుంటారు. మధ్య రాత్రిలో లేచినా కొందరు నీళ్లు తాగి మరీ పడుకుంటారు. ఇలా చేయడం మంచిదేనా? ఎక్స్‌పర్ట్స్ ఏం చెప్తున్నారో చూద్దాం.
నీళ్లు తాగడం మంచిదే కానీ.. రాత్రిపూట నిద్రకు ముందు ఎక్కువగా తాగకపోవడం బెటర్ అంటున్నారు నిపుణులు. దీనివల్ల శరీరంలో సాధారణ టెంపరేచర్ లెవల్స్ పడిపోయే అవకాశం ఉంది. అంతేకాకుండా ఎక్కువ నీరు తాగడంవల్ల మధ్యలోనే నిద్ర మెలకువ వస్తుంది. ఎక్కువసార్లు యూరిన్ పోవలసి రావడంవల్ల క్వాలిటీ స్లీప్ దెబ్బతింటుంది. ఫలితంగా ఒత్తిడి, అలసట పెరుగుతాయి. కాబట్టి రోజంతా సరిపడా నీళ్లు తాగాలి. తప్ప సరిగ్గా నిద్రపోయేముందు గానీ, మధ్య రాత్రిలో లేచినప్పుడు గానీ ఎక్కువగా వాటర్ తాగకపోవడమే మంచిదంటున్నారు నిపుణులు.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దీనిని ‘దిశ’ ధృవీకరించడం లేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.