మామిడి పండ్లు తిని పిక్కలు పడేస్తున్నారా.. వాటితో కలిగే ప్రయోజనాలెన్నో!

by Hamsa |   ( Updated:2024-04-28 15:01:00.0  )
మామిడి పండ్లు తిని పిక్కలు పడేస్తున్నారా.. వాటితో కలిగే ప్రయోజనాలెన్నో!
X

దిశ, ఫీచర్స్: ఎండాకాలంలో విరివిగా దొరికే పండ్లలో మామిడి పండ్లు, కాయలు ముందుంటాయి. సమ్మర్ సీజన్ మొత్తం మామిడి పండ్లకు వీపరీతమైన డిమాండ్ ఉంటుంది. చిన్నా పెద్ద ఎంతో ఈ పండ్లను ఎంతో ఇష్టంగా తింటుంటారు. దీనితో ఎన్నో రకాల వెరైటీ ఐటమ్స్ రెడీ చేసుకుని ఆరగిస్తుంటారు. అలాగే పుల్లటి మామిడి కాయలతో పచ్చడి పెట్టడం గత కొద్ది కాలం నుండి వస్తున్న సంప్రదాయంగా మారింది. అలాగే సమ్మర్ పోయేదాక మామిడి కాయతో పప్పుతో పాటు పలు రెసిపీలు చేస్తూ ఇష్టంగా కుటుంబమంతా తింటుంటారు.

ఎందుకంటే సమ్మర్ అయిపోయిందంటే.. మామిడి కోసం మళ్లీ ఏడాదిపాటు వెయిట్ చేయాలి కాబట్టి. అయితే కొందరు మామిడి పండ్లు తినేసి పిక్కలు పనికి రావని వాటిని పడేస్తుంటారు. కానీ పిక్కలతో కూడా శరీరానికి పలు రకాల ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. పిక్కల్లో ఉండే.. కాపర్, మెగ్నీషియం, పాలెట్, మాంగిఫెరాన్, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, పొటాషియం, వంటివి ఉండి పలు లాభాలను కలిగిస్తాయని వెల్లడించారు.

*కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నవారికి మామిడి పిక్కలు మంచి ఎంపిక. వాటిని ఎండబెట్టి పొడి చేసి పాలలో వేసుకొని తాగడం వల్ల కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుంది.

*అలాగే మామిడి పిక్కల్లో ఉండే.. ఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు జీర్ణక్రియకు మేలు చేస్తాయి. అలాగే ఎసిడిటీ సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తాయట.

*అతిసారంతో ఇబ్బందులు ఎదుర్కొనే వారు మామిడి పిక్కలను పొడిగా చేసి గోరువెచ్చని నీటిలో టీ స్పూన్ తేనెను కలుపుకొని తాగితే మంచి ఫలితం ఉంటుంది.

* ఇటీవల కాలంలో చాలా మంది గుండె జబ్బులతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎంతోమంది హార్ట్ ఎటాక్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా గత కొద్ది కాలంగా గుండె సమస్యలు వేధిస్తున్నాయి. అయితే గుండె సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే పిక్కలతో చేసిన పొడిని ఉపయోగించాలి.

(పైన చెప్పిన సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా తీసుకున్నది. దీనిని దిశ ధృవీకరించలేదు.)

Read More...

డేంజర్: ఐస్ క్రీమ్ తిన్న తర్వాత వీటిని అస్సలే తినొద్దు..!






Advertisement

Next Story