అల్యూమినియం కవర్స్‌లో ఉంచిన ఆహారాన్ని తింటున్నారా.. డేంజర్‌లో పడ్డట్టే!

by Hamsa |
అల్యూమినియం కవర్స్‌లో ఉంచిన ఆహారాన్ని తింటున్నారా.. డేంజర్‌లో పడ్డట్టే!
X

దిశ, ఫీచర్స్: ప్రస్తుతం చాలా మంది ఇంట్లో వంట చేయడం మానేసి ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టుకోవడం ఎక్కువైంది. అయితే టిఫిన్స్ కానుంచి డిన్నర్ వరకు తమకు ఏం కావాలన్నా సరే ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టుకుని వేడివేడి ఉన్న ఐటమ్స్‌ను లాగించేస్తున్నారు. అయితే రెస్టారెంట్స్, హోటల్స్ ఆహార పదార్ధాలు వేడిగా ఉండేందుకు అల్యూమినియం కలర్‌లో చుట్టి ఇస్తున్నారు. చపాతి, నూడిల్స్, బిర్యానీ, ఫ్రైడ్ రైస్, కర్రీస్, టిఫిన్స్, వంటివి ఏం కొన్నా కానీ అల్యూమినియం కలర్స్‌లో ప్యాక్ చేసి ఇస్తుంటారు. దీంతో అందులోని ఐటమ్స్ చాలాసేపటి వరకు వేడిగా ఉంటాయి.

దీంతో ఈ మధ్య కాలంలో చాలామంది గృహిణులు అల్యూమినియం పాత్రలు కూడా ఉపయోగిస్తూ వంట చేస్తున్నారు. అలాగే కవర్స్ తెచ్చుకుని పిల్లలకు, భర్తకు ఫుడ్ ప్యాకింగ్ చేసి పంపిస్తున్నారు. కానీ అలా చేయడం వల్ల ఆరోగ్యానికి చాలా నష్టం వాటిల్లుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అల్యూమినియం శరీరంలోకి చేరడం వల్ల కండరాల బలహీనత, ఎముకల నొప్పి, మూర్చ వంటివి వస్తాయి. అలాగే అల్జీమర్స్, పార్కన్సన్స్ నాడి సంబంధిత సమస్యలు తలెత్తడంతో పాటుగా ఇబ్బందులకు గురవుతారని నిపుణులు సలహా ఇస్తున్నారు. ముఖ్యంగా కొన్ని కూరగాయల్లోనూ అల్యూమినియం ఉంటుందని అంటున్నారు.

అవేంటంటే.. టమోటా, నిమ్మ వంటి ఆమ్ల గుణం కలిగిన పదార్థాలు అల్యూమినియం పాత్రలో వేడి చేయడం వల్ల ఎక్కువగా లీక్ అయి ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. అయితే అల్యూమినియం పాత్రలకంటే కవర్స్‌లో ఉంచిన ఆహారం చాలా ప్రమాదకరమైనదని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి అల్యూమినియం పాత్రలను పూర్తిగా దూరం ఉంచడం కష్టతరం అయినప్పటికీ వాటిని ఉపయోగించకపోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. అల్యూమినియం ఫాయిల్స్‌లోని ఫుడ్ తినడం వల్ల మూత్రాశయ అనారోగ్య సమస్యలు, మెదడు పనితీరు దెబ్బ తినడం వంటివి తలెత్తడం ఖాయం. కాబట్టి స్టీల్, సెరామిక్, పింగాణీ వంటి వాటిలో ఆహారం వండుకోవడం, స్టోర్ చేయడం బెటర్.

గమనిక: పైన ఇచ్చిన సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే అందించాము. దీనిని ఇంటర్నెట్ ఆధారంగా తీసుకోబడింది. దీనిని దిశ ధృవికరించదు.



Next Story

Most Viewed