CM Chandrababu:బుడమేరు గండ్లు పూడ్చివేత..మంత్రి నిమ్మలను అభినందించిన సీఎం

by Jakkula Mamatha |
CM Chandrababu:బుడమేరు గండ్లు పూడ్చివేత..మంత్రి నిమ్మలను అభినందించిన సీఎం
X

దిశ,వెబ్‌డెస్క్:రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బుడమేరు పొంగి విజయవాడ నగరాన్ని ముంచెత్తిన సంగతి తెలిసిందే. బుడమేరుకు(Budameru) మూడు గండ్లు పడడంతో ఈ జిల్లాలో భారీ విపత్తు(huge disaster) సంభవించింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ వరదల(Floods) కారణంగా ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. తినడానికి తిండి, తాగడానికి నీళ్లు లేక తీవ్ర అవస్థలు పడ్డారు. అయితే వరద(Floods)ల సమయంలో గండ్లు పూడ్చేందుకు ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు(Nimmala Ramanaidu) చేసిన కృషి అందరినీ ఆకట్టుకుంది. ఏకంగా సీఎం చంద్రబాబు(CM Chandrababu) సహా సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజల నుంచి ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అయితే వరదల కారణంగా బుడమేరుకు(Budameru) పడ్డ గండ్లు పూడ్చేందుకు మంత్రి నిమ్మల దాదాపు 64 గంటల పాటు నిద్ర లేకుండా పని చేశారు.

బుడమేరు(Budameru) కట్ట పైనే అధికారులు, సిబ్బందితో మకాం వేసి నిద్రాహారాలు మాని పని చేశారు. గండ్లు పూడ్చడమే లక్ష్యంగా యుద్ధ ప్రాతిపదికన పనులు చేయించారు. సీఎం సహాయంతో రంగంలోకి దిగిన ఆర్మీ(Army) సిబ్బందికి సైతం సలహాలు, సూచనలు ఇస్తూ పనులు ముమ్మరం చేయించారు. అనుకున్న సమయం కంటే ముందుగానే పనులు పూర్తి చేసి ‘శభాష్’ అనిపించుకున్నారు. నిన్న(శనివారం) పూడ్చివేత పనులు పరిశీలించేందుకు వచ్చిన మంత్రి నారా లోకేష్(Nara Lokesh) సైతం ఆయన పడుతున్న కష్టాన్ని చూసి మెచ్చుకున్నారు. ప్రజల సంక్షేమం కోసం మీరు చూపిస్తున్న నిబద్ధత(commitment) అభినందనీయమని మంత్రిని కొనియాడారు. నిమ్మల చేసిన కృషికి సంబంధించిన వీడియో ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మంత్రి అంటే ఇలానే ఉండాలని పలువురు నెటిజన్లు నిమ్మలను అభినందించారు.

Advertisement

Next Story

Most Viewed