ప్రభుత్వాన్ని విమర్శిస్తూ జగన్‌ ట్వీట్‌.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన సినీ నటుడు బ్రహ్మాజీ

by Kavitha |
ప్రభుత్వాన్ని విమర్శిస్తూ జగన్‌ ట్వీట్‌.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన సినీ నటుడు బ్రహ్మాజీ
X

దిశ, వెబ్‌డెస్క్: గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా విజయవాడ పరిసర ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది. ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) దగ్గరి నుంచి మంత్రులు, అధికార యంత్రాంగం, ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సహా ప్రతి ఒక్కరూ నిద్రాహారాలు మాని ప్రజలకు రేయింబవళ్ళూ సాయం చేస్తున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వానికి సహాయం అందించడం మానేసి, వైకాపా అధినేత జగన్‌ సోషల్ మీడియాలో పలు విమర్శలు గుప్పిస్తున్నారు.

అందులో భాగంగా.. వరదలు వచ్చి 8 రోజులు గడుస్తున్నా బాధితులకు సాయం అందడం లేదని ఆరోపిస్తూ, అసలు ఇదంతా ఎందుకు జరిగిందో చెబుతూ, ఎక్స్‌(X) వేదికగా జగన్‌ సుదీర్ఘ పోస్ట్‌ పెట్టారు. దీనిపై 'క్షేత్రస్థాయిలో జరుగుతున్న సాయం మీకు కనపడటం లేదా' అంటూ నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో మాజీ సీఎం జగన్‌ ట్వీట్‌పై సినీ నటుడు బ్రహ్మాజీ (BRAHMAJI)స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ''మీరు కరెక్ట్ సార్ .. వాళ్ళు చెయ్యలేరు.. ఇక నుంచి మనం చేద్దాం.. ఫస్ట్‌ మనం రూ.1000 కోట్లు విడుదల చేద్దాం. మన వైకాపా కేడర్‌ మొత్తాన్ని రంగంలోకి దింపుదాం .. మనకి జనాలు ముఖ్యం.. ప్రభుత్వం కాదు. మనం చేసి చూపిద్దాం సార్.. జై జగన్‌ అన్నా'' అంటూ పోస్ట్‌ పెట్టారు. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది.

Read More : నా X అకౌంట్ ఎవరో హ్యాక్ చేశారు.. నాకు ఆ పోస్ట్‌కు ఎటువంటి సంబంధం లేదు: సినీ నటుడు బ్రహ్మాజీ

Advertisement

Next Story

Most Viewed