Samantha: సమంత ముఖంలో సంతోషం.. ఏమైంది ఈ వేళ అంటూ కామెంట్స్ చేస్తున్న నెటిజెన్స్

by Prasanna |
Samantha: సమంత ముఖంలో సంతోషం.. ఏమైంది ఈ వేళ అంటూ కామెంట్స్ చేస్తున్న నెటిజెన్స్
X

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్య కాలంలో సామ్ సినిమాల కంటే .. తన వ్యక్తిగత జీవితం గురించే ఎక్కువగా వార్తలో నిలుస్తూ వచ్చింది ఈ హీరోయిన్. తన మొదటి మూవీ హీరో నాగచైతన్య అని పెళ్లి చేసుకున్న సమంత.. అతనితో వచ్చిన కొన్ని గొడవల వలన విడాకులు తీసుకుంది.నాగ చైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత సామ్ మానసికంగా నలిగిపోయింది. కొన్నిరోజులు ఎవరికీ కాంటాక్ట్ లేకుండా పోయింది.

కానీ, ఇప్పటికీ కూడా ఆ కారణం బయటకు రాలేదు. ఇదిలా ఉండగా సమంత మాజీ భర్త నాగచైతన్య.. హీరోయిన్ శోభితతో గ్రాండుగా నిశ్చితార్థం జరుపుకున్నారు. దీనిపై సమంత రెస్పాండ్ అవ్వలేదు. ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉంటోంది.

త్వరలోనే.. ఈ మధ్యనే తాను కొత్తగా మొదలు పెట్టిన నిర్మాణ సంస్థ ద్వారా.. రాబోతున్న సినిమా మా ఇంటి బంగారంలో.. కనిపించి తెలుగు ప్రేక్షకులను మెప్పించనుంది. ఇంకో వైపు బాలీవుడ్ లో సైతం సమంతకు బాగానే అవకాశాలు వస్తున్నాయి. మరోపక్క ఇన్స్టాగ్రామ్ లో.. ఆమె ఫ్యాన్స్ కోసం ఫోటోలు షేర్ చేస్తూ అందర్ని ఆకట్టుకుంటూ ఉంటుంది. తాజాగా సమంత పూల పూల డ్రస్సులో కనిపించి అందర్ని ఆశ్చర్యపరుస్తుంది. ఈ ఫొటోలో ఆమె ముఖంలో సంతోషం చూసి ఏమైంది ఈ వేళ అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed