- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Trending: మద్యం మత్తులో మలయాళ నటుడి వీరంగం.. నెట్టింట్లో వీడియో వైరల్

X
దిశ, వెబ్‌డెస్క్: ఒక్క సినిమాతో ఎవరికైనా స్టార్‌డమ్ (Stardom) రాగానే వాళ్లకు ఎక్కడ లేని గర్వం వచ్చేస్తుంది. ఫ్యాన్స్ ఆదరిస్తేనే తాము ఇంత ఎత్తుకు ఎదిగామని ఏ ఒక్కరూ.. తమకు తాముగా ఆత్మ పరిశీలన చేసుకోరు. విచ్చలవిడిగా డబ్బు కనిపించే సరికి మద్యం లేదా ఇతర దురవాట్లకు బానిసలు అవుతుంటారు. మరికొందరు ఏకంగా రోడ్లపైకి వచ్చి హల్‌చల్ చేస్తుంటారు. తాజాగా, ఓ మళయాల (Malayalam) నటుడు మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. వివరాల్లోకి వెళితే.. ‘జైలర్’ (Jailer) మూవీతో తన నటనతో గుర్తింపు తెచ్చుకున్న వినాయకన్ (Vinayakan) పీకలదాక తాగి బీభత్సం సృష్టించాడు. ఏకంగా తన ఇంటి బాల్కనీలో నిలబడి మద్యం మత్తులో తూలుతూ.. సరిగా నిలబడలేక అరుస్తూ ఇరుగు పొరుగు వారిని బూతులు తిట్టాడు. అయితే, అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా (Social Media)లో విపరీతంగా వైరల్ అవుతోంది.
Next Story