ఉదయాన్నే బ్రష్ చేస్తున్నప్పుడు ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా?.. బీ అలర్ట్ !

by Javid Pasha |
ఉదయాన్నే బ్రష్ చేస్తున్నప్పుడు ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా?.. బీ అలర్ట్ !
X

దిశ, ఫీచర్స్ : సాధారణంగా ప్రతిరోజూ ఉదయాన్నే మనం పళ్లు తోముతుంటాం. అయితే బ్రష్ చేస్తున్నప్పుడు కొందరిలో వాంతులు, వికారం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ఎందుకిలా జరుగుతుందో తెలియక కొందరు నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ వరుసగా అదే కంటిన్యూ అయితే మాత్రం అలర్ట్ అవ్వాల్సిందే. ఎందుకంటే కొన్ని ఆరోగ్యపరమైన కారణాలు, వ్యాధులు కూడా అందుకు కారణం కావచ్చు. అవేంటో చూద్దాం.

* లివర్ సంబంధింత వ్యాధులు, గాల్ బ్లాడర్‌లో పైత్య రసాలు అధికమొత్తంలో పేరుకు పోవడంవల్ల కూడా బ్రష్ చేస్తున్నప్పుడు పలువురికి వాంతులు వచ్చినట్లు అనిపిస్తుంది. అలాగే గ్యాస్ట్రరైటిస్, ఎసిడిటీ వంటి సమస్యలు కూడా బ్రష్ చేస్తు్న్నప్పుడు వికారానికి దారితీస్తాయి.

* కొందరికి అల్సర్ ప్రాబ్లం ఉంటుంది. చాలామంది తమకు ఈ సమస్య ఉందని తీవ్రమైన లక్షణాలు కనబడే వరకు గుర్తించరు. కొందరు అదే తగ్గుతుందిలే అని పట్టించుకోరు. కానీ తర్వాత ఇబ్బందులకు కారణం అవుతుంది. అల్సర్ ప్రాబ్లం ఉన్నవారిలో కూడా బ్రష్ చేస్తున్నప్పుడు వాంతులు అవడం, వికారం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి.

* కిడ్నీ వ్యాధులు ఉన్నవారిలో కూడా పళ్లు తోముతున్నప్పుడు వాంతులు అయ్యే చాన్సెస్ ఉంటాయి. కానీ అవగాహన లేకపోవడం వల్ల ఇలా జరగడం వ్యాధి లక్షణంగా చాలా మంది గుర్తించరు. శరీరంలో మూత్రపిండాల పనితీరు మందగించినప్పుడు, కిడ్నీ‌ల్లో స్టోన్స్ ఏర్పడి పెరిగే క్రమంలో బ్రష్ చేసేటప్పుడు వాంతులు, వికారం వంటి సింప్టమ్స్ కనిపిస్తాయి. కాబట్టి వరుసగా ఐదారు రోజులు బ్రష్ చేస్తున్నప్పుడు మీలో వాంతులు, వికారం వంటివి కనిపిస్తే వైద్య నిపుణులను సంప్రదించడం ఉత్తమం.

Advertisement

Next Story

Most Viewed