Chapati on Gas: చపాతీలు నేరుగా గ్యాస్ మంటపై కాలుస్తున్నారా? ఈ విషయాలు తప్పక గుర్తుంచుకోండి!

by Anjali |   ( Updated:2024-09-25 15:17:51.0  )
Chapati on Gas: చపాతీలు నేరుగా గ్యాస్ మంటపై కాలుస్తున్నారా? ఈ విషయాలు తప్పక గుర్తుంచుకోండి!
X

వెబ్ డెస్క్: హెల్త్ బాగోలేకపోయినా, బాగా బరువు పెరిగినప్పుడు తక్షణమే తగ్గాలనే ఆలోచన వచ్చినా అందరూ ముందు చేసేది ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం. జ్వరం వచ్చినా, ఇంకేదైనా ఆరోగ్య సమస్య వచ్చినా ఎవరైనా ముందుగా చపాతీ తింటుంటారు. అంతేకాదు.. బరువు తగ్గాలనే ఆలోచన వచ్చిన వాళ్లు కూడా ఫుడ్ విషయంలో తీసుకొనే మొదటి జాగ్రత్త చపాతే. చపాతీలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో కాల్షియం, ప్రొటీన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇది తిన్న తర్వాత చాలా సేపటివరకూ ఆకలేయదు కాబట్టి బరువు నియంత్రణలో ఉంటుంది. అయితే చపాతీలు చేసుకునే విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోరు.

ఈ నేపథ్యంలో ఆరోగ్య నిపుణులు కీలక సూచనలు చేస్తున్నారు. గ్యాస్ పొయ్యి మీద కాకుండా కట్టెలు పొయ్యి మీద చేసుకునే చపాతీలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని చెబుతున్నారు. స్టవ్‌లోంచి వచ్చే మంటలో కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజెన్ డైయాక్సైడ్, సూక్ష్మమైన దుమ్మ కణాలు బోలెడన్ని ఉంటాయి. ఇవి శరీరంలోకి వెళితే అనారోగ్యానికి దారితీస్తాయని హెచ్చరిస్తున్నారు. ఒకవేళ గ్యాస్ మీద చేసుకున్నా.. నేరుగా ఆ మంటపై చపాతీలు పెట్టొద్దని.. మూకుడు లేదా పెనంపై పెట్టి చేసుకోవాలని సూచిస్తున్నారు. దీని వల్ల పిండిలోని పోషకాలు యథాతథంగా నిలిచి ఉంటాయని అంటున్నారు. దీంతో, కొవ్వు పెరగకపోవడమే కాకుండా.. కొంత ఆయిల్ వాడకాన్ని కూడా తగ్గించి ఆరోగ్యానికి మేలు చేస్తాయని చెబుతున్నారు.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story