- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నీటిలోపల 7 వేల సంవత్సరాలనాటి రహదారిని కనుగొన్న ఆర్కియాలజిస్టులు
దిశ, ఫీచర్స్ : మానవ నాగరికతకు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఎటువంటి సౌకర్యాలు లేని ఆదిమ కాలం మొదలు అన్ని సౌకర్యాలు ఉన్న నేటి అధునాతన కాలం వరకూ ఎన్నో మార్పులు జరిగాయి. ఇప్పటికీ గతం గురించిన అద్భుతాలను శాస్త్రవేత్తలు కనుగొంటూనే ఉన్నారు. కొన్నిసార్లు అవి మనకు ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటాయి. ప్రస్తుతం అదే జరిగింది. పురావస్తు శాస్త్రవేత్తలు 7000 సంవత్సరాల అతి పురాతన మానవ నిర్మిత రహదారి అవశేషాలను దక్షిణ క్రొయేషియా తీరంలోని సోలిన్ కోర్కులా ప్రాంతంలో పురాతన నియోలిథిక్ ప్రదేశంలోని ఒక ద్వీపంలో కనుగొన్నారు. ప్రస్తుతం ఈ రోడ్డు నీటిలో మునిగిపోయి ఉంది. 2021లో దక్షిణ క్రొయేషియాలోని యూనివర్సిటీ ఆఫ్ జదర్‌కు (University of Zadar in Croatia) చెందిన మేట్ పరికా (Mate Parica) కోర్కులా ప్రాంతం చుట్టుపక్కల నీటిలో మునిగి ఉన్న ప్రాంతంలో తన బృందంతో కలిసి ఉపగ్రహ చిత్రాలను విశ్లేషిస్తున్నప్పుడు నీటి అడుగు భాగంలో 4 నుంచి 5 మీటర్ల ఎత్తులో ఉన్న ఒక రాతి గోడను కనుగొన్నది. ఇంట్రెస్టెంగ్ విషయం ఏంటంటే.. ఈ ప్రాంతం మధ్యధరా సముద్రంలోని చాలా ప్రాంతాలకు భిన్నంగా సముద్రపు అలల నుంచి, శక్తివంతమైన తరంగాల నుంచి సురక్షితంగా ఉంది. అందులో పురాతన రహదారి ఉండటమే ఇందుకు కారణం కావచ్చని నిపుణులు భావిస్తున్నారు. కొత్తగా కనుగొన బడిని ఈ రహదారి నీటిలోపల 4 మీటర్ల వెడల్పుతో, జాగ్రత్తగా పేర్చబడిన రాతి పలకలతో నిర్మించబడి ఉంది. ప్రస్తుతం అది మట్టి పొరతో నిండి ఉంది. తూర్పు అడ్రియాటిక్ సముద్రం చుట్టుపక్కల ప్రాంతాలలో నివసించే నియోలిథిక్ హ్వార్ సంస్కృతికి చెందిన వ్యక్తులు 7 వేల సంవత్సరాల క్రితం దీనిని నిర్మించారని పరిశోధకులు భావిస్తున్నారు. జలదర్ యూనివర్సిటీ కూడా ఇదే విషయాన్ని పునరుద్ఘాటించింది.
Also Read.