ప్రెగ్నెన్సీ టైమ్‌లో యాంటీ బయోటిక్స్ మంచిదేనా?

by sudharani |   ( Updated:2022-12-12 14:13:57.0  )
ప్రెగ్నెన్సీ టైమ్‌లో యాంటీ బయోటిక్స్ మంచిదేనా?
X

దిశ, ఫీచర్స్: ప్రగ్నెన్సీ టైమ్‌లో యాంటీ బయోటిక్స్ తీసుకోవడంపై పునరాలోచించాలని నిపుణులు సూచిస్తున్నారు. తేలికపాటి జ్వరం, దగ్గు, జలుబు ఉంటే సొంత వైద్యం మంచిదని, లేదంటే పుట్టబోయే బిడ్డపై అవి ప్రభావం చూపుతాయని హెచ్చరిస్తున్నారు. డాక్టర్ సిఫారసు లేకుండా మందులు అసలు వాడొద్దు, కానీ ఈ మధ్య ఓవర్-ది-కౌంటర్ ఔషధాల వినియోగం పెరగడంతో.. కడుపులో పిండంపై ప్రభావంతోపాటు గర్భిణుల్లో పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.

ప్రెగ్నెన్సీ టైమ్‌లో గర్భాశయంలో ప్లాసెంటా అనే అవయవం అభివృద్ధి చెందుతుంది. మావి బొడ్డుతాడు ద్వారా శిశువుకు అనుసంధానించి ఉంటుంది. దీని ద్వారా అభివృద్ధి చెందుతున్న పిండం ఆక్సిజన్, రక్తం, పోషకాలను పొందుతుంది. ఇది ఫిల్టర్‌గానూ పని చేస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో గర్భిణులు తీసుకునే మందులు లేదా యాంటీ బయోటిక్స్ ఈ ఫిల్టర్ గుండా వెళ్లి, పిండం అభివృద్ధిపై హానికరమైన ప్రభావాలను కలిగిస్తాయి. శిశువులో నెమ్మదిగా ఎముకల పెరుగుదల లేదా తడిసిన దంతాలు.. తల్లిలో వికారం, విరేచనాలు, ఉబ్బరం వంటి దుష్ప్రభావాలను కలిగిస్తాయి.

జాగ్రత్తలు :

• ముఖ్యంగా మొదటి త్రైమాసికంలో యాంటీ బయోటిక్స్‌ను నివారించండి.

• డాక్టర్ సలహా ఇస్తే తప్ప అన్ని యాంటీబయోటిక్స్ తక్కువ మోతాదులో ఉండాలి.

• జలుబు వంటి చిన్న పరిస్థితులకు యాంటీ బయోటిక్స్‌తో చికిత్స చేయకూడదు. ఆవిరి పీల్చడం, గోరువెచ్చని నీటితో పుక్కిలించడం వంటి చిట్కాలను ప్రయత్నించండి.

Advertisement

Next Story

Most Viewed