- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రపంచాన్ని వణికిస్తున్న మరో కొత్త సిండ్రోమ్
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా వైరస్. ఈ మాట వింటే చాలు.. గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. ఇప్పుడు అలాంటి ఓ సిండ్రోమ్‌నే ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. తాజాగా విస్తరిస్తున్న కొత్త వ్యాధి కూడా చైనాలోనే ఉద్భవించడం చర్చనీయాంశంగా మారింది. అదే వైట్‌లాంగ్ సిండ్రోమ్. గడిచిన కొన్ని నెలల్లోనే చాలా మంది ఈ సిండ్రోమ్ బారిన పడ్డారు. ఇప్పటి వరకు అమెరికాలోని ఒహియోలో సుమారు 142 న్యుమోనియా కేసులు నమోదయ్యాయి. ఈ సిండ్రోమ్ లక్షణాలు ఎక్కువగా 3 నుంచి 8 సంవత్సరాల వయస్సు గల పిల్లల్లోనే కనిపిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక తెలిపింది. అసలు ఈ వైట్ లాంగ్ సిండ్రోమ్ అంటే ఏమిటి, ఇది ఎలా వ్యాపిస్తుంది, దీని లక్షణాలు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం..
వైట్ లాంగ్ సిండ్రోమ్ అంటే ఏమిటి, ఎలా వ్యాపిస్తుంది ?
వైట్ లాంగ్ సిండ్రోమ్‌ని న్యుమోనియా అని కూడా పిలుస్తున్నారు. ఈ వ్యాధి బ్యాక్టీరియా, వైరల్ ఇన్‌ఫెక్షన్ల రెండూ కలిసినప్పుడు వ్యాప్తి చెందుతుందని మసాచుసెట్స్‌లోని వైద్యులు తెలిపారు. ఈ సిండ్రోమ్ వచ్చిన పిల్లల ఊపిరితిత్తులలో పీఏఎంలో, కాల్షియం చేరడం మొదలవుతుంది. దీంతో పిల్లలకు దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం, ఛాతీ నొప్పి వంటివి వస్తుంటాయి. పిల్లలకు ఎక్స్ రే తీసినప్పుడు ఊపిరితిత్తుల్లో తెల్లటి మచ్చలు, తెల్లటిరంగు ప్యాచ్‌లు కనిపిస్తుంటాయి. అలాగే ఈ సిండ్రోమ్ బారినపడిన వారిలో దగ్గు, జ్వరం, అలసట ఒల్లు నొప్పులతో బాధపడుతూ ఉంటారు. ఇటీవల కొన్ని ఆరోగ్య సంస్థలు ఇచ్చిన నివేదికల ప్రకారం ప్రస్తుతం ఈ సిండ్రోమ్ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోందని చెబుతున్నాయి.