Anant Ambani: అనంత్ అంబానీ పెళ్లిలో అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన షారుఖ్.. రూ. 40 కోట్లతో..

by Javid Pasha |   ( Updated:2024-07-23 17:04:56.0  )
Anant Ambani: అనంత్ అంబానీ పెళ్లిలో అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన షారుఖ్.. రూ. 40 కోట్లతో..
X

దిశ, ఫీచర్స్ : రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, ప్రముఖ వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ పెళ్లి ఎంత ఘనంగా జరిగిందో తెలిసిందే. జులై 12న ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ హాల్లో ఈ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. దేశ విదేశాల నుంచి ఎంతోమంది సెలబ్రిటీలు, సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు అటెండ్ అయ్యారు. ముఖ్యంగా పెళ్లి కార్యక్రమాలు ప్రారంభం అయినప్పటి నుంచి ముగిసే వరకు బాలీవుడ్ తారలంతా ప్రతీ వేడుకలో సందడి చేస్తూ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.

ఇదిలా ఉంటే.. అనంత్ అంబానీ మ్యారేజ్ సెలబ్రేషన్‌కు సంబంధించిన ప్రతీ విషయాన్ని ప్రజలు ఇప్పటికీ చర్చించుకుంటున్నారు. మ్యారేజ్‌కి వచ్చిన వారిలో ఎవరు ఎలాంటి గిఫ్టులు ఇచ్చారనేది తెలుసుకునేందుకు క్యూరియా సిటీ ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ బాద్ షా, షారుఖ్ ఖాన్ ఏం గిఫ్ట్ ఇచ్చాడోనని పలువురు గూగుల్ సెర్చ్ కూడా చేశారట. ప్రజెంట్ అందుకు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుండగా.. ఇందులో బాలీవుడ్ ప్రముఖులు అనంత్ అంబానీ పెళ్లిలో, ఎవరు ఏం బహుమతులు ఇచ్చారనే సమాచారం కూడా ఉండటంతో అందరినీ ఆకట్టుకుంటోంది.

కాగా రీసెంట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం.. బాలీవుడ్ ఫేమస్ హీరో షారుక్ ఖాన్ అనంత్ అంబానీ పెళ్లిలో రూ. 40 కోట్ల విలువైన ఓ ఫ్లాట్ ఇచ్చాడు. కాగా అది ఇండియాలో కాదు.. ఫ్రాన్స్‌లో ఉందట. ఇక మరో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ రూ. 16 కోట్ల విలువైన స్పోర్ట్స్ బైక్ బహుమతి ఇవ్వగా, అక్షయ్ కుమార్ పెళ్లిక రాకున్నా.. రిసెప్షన్‌కు అటెండ్ అయ్యి రూ. 60 లక్షల విలువైన గోల్డ్ పెన్ గిఫ్ట్‌గా ఇచ్చాడు. అమితాబ్ బచ్చన్ రాధికా మర్చంట్‌కు రూ. 30 కోట్ల విలువైన ఓ నెక్లెస్ ఇవ్వగా.. బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ రూ. 9 కోట్ల విలువైన మెర్సెడీస్ కారును గిఫ్టుగా ఇచ్చారు. ఇక దీపికా పడుకొణె, రణ్ వీర్ సింగ్ కలిసి రూ. 20 కోట్ల విలువైన కస్టమైజ్డ్ రోలస్ రాయ్స్ కారును బహుమతిగా ఇచ్చారు.

Read more...

viral: గ్యాంగ్‌స్టర్‌తో వెళ్లిపోయిన IAS ఆఫీసర్ భార్య.. అంతలోనే ఘోరం!

Advertisement

Next Story