- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పుట్టగొడుగులతో జ్ఞాపకశక్తి మెరుగు.. అల్జీమర్స్ నివారణ సాధ్యమే!!
దిశ, ఫీచర్స్: మనం ఆహారంలో భాగంగా ఉపయోగించే మష్రూమ్స్ ఆరోగ్యానికి మంచిదని, ఇమ్యూనిటీ పవర్ పెరుగుదలకు తోడ్పడతాయని తెలిసిందే. కానీ ప్రస్తుతం సైంటిస్టులు మరో శుభవార్త చెప్పారు. పుట్టగొడుగులు మెదడు కణజాలాల ఆరోగ్యానికి మంచిదని, అవి జ్ఞాపకశక్తిని పెంచుతాయని, అల్జీమర్ వ్యాధిని నివారిస్తాయని సైంటిస్టులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన పోషకాలు, సమ్మేళనాలు మష్రూమ్స్‌లో ఉన్నాయని క్వీన్స్ లాండ్ బ్రెయిన్ ఇన్‌స్టిట్యూట్(UQ) కు చెందిన ప్రొఫెసర్ ఫ్రెడరిక్ మెయునియర్ టీమ్ స్పష్టం చేసింది. మష్రూమ్స్ రకాల్లోని హెరిసియం ఎరినాసియస్‌లో జ్ఞాపకశక్తిని మెరుగుపరిచే ఔషధ గుణాలున్నాయని కనుగొన్నది.
ఫిబ్రవరి 11న మెల్బోర్న్ కేంద్రంగా నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం.. 'లయన్స్ మెన్' రకానికి చెందిన మష్రూమ్స్‌మెదడు కణాల పెరుగుదలను, జ్ఞాపకశక్తిని మెరుగు పరిచే గుణాన్ని కలిగి ఉన్నాయని సైంటిస్టులు కనుగొన్నారు. ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్‌లాండ్ పరిశోధకులు ప్రీ క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా వీటిని పరిశీలించారు. ఆ తర్వాత హెరిసియం ఎరినాసియస్ కూడా నరాల పనితీరును, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తున్నట్లు తెలుసుకున్నారు. ఈ అధ్యయనానికి సంబంధించిన విషయాలు 'జర్నల్ ఆఫ్ న్యూరో కెమిస్ట్రీ' లో పబ్లిష్ అయ్యాయి.
అయితే లయన్స్ మెన్ పుట్టగొడుగులను చాలా ఏండ్లుగా ఆసియా దేశాలలో సాంప్రదాయ వైద్యంలో ఉపయోగిస్తున్నారు. కానీ అవి మెదడు కణాలపై ఎలాంటి ప్రభావాన్ని కలిగిస్తాయనేది తాము సైంటిఫిక్‌గా నిర్ధారించాలనుకున్నామని మెయునియర్ చెప్పారు. లయన్ మెన్ పుట్టగొడుగు మెదడు కణాల పెరుగుదలకు, జ్ఞాపకశక్తి తోడ్పడుతుందని, అల్జీమర్స్ వ్యాధి నివారణలో వీటిని వినియోగించవచ్చని ప్రీ క్లినికల్ ట్రయల్ ద్వారా రుజువైనట్లు చెప్పారు.
ల్యాబ్‌లో పరీక్షించినప్పుడు మెదడు కణాలపై హెరిసియం ఎరినాసియస్ నుంచి వేరుచేయబడిన సమ్మేళనాలు న్యూరో ట్రోఫిక్ ప్రభావాలను చూపాయి. ఇవి కణాలను యాక్టివేట్ చేయడం, అనుసంధానించు కోవడం వంటివి గమనించామని పేర్కొన్నారు. సూపర్ రిజల్యూషన్ మైక్రోస్కోపీని ఉపయోగించి పుట్టగొడుగులను ల్యాబ్‌ల్లో పరిశీలించారు. వాటిలోని సమ్మేళనాలు మెదడు కణాలను యాక్టివేట్ చేయడంలో, మెదడులోని ఇతర న్యూరాన్‌లతో కనెక్ట్ కావడంలో కీలకపాత్ర పోషిస్తాయని సైంటిస్టు మెయునియర్ వెల్లడించాడు.