Peanut and jaggery : బెల్లం-శనగపప్పు కలిపి తింటే ఎన్నో లాభాలు!!

by Vinod kumar |   ( Updated:2023-02-14 13:28:18.0  )
Peanut and jaggery : బెల్లం-శనగపప్పు కలిపి తింటే ఎన్నో లాభాలు!!
X

దిశ, ఫీచర్స్: మనం ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి. ఈ కోవకు చెందినదే బెల్లం, శనగపప్పు. కాగా దీని వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటో చూద్దాం.

1. మనకు తెలిసి బెల్లం లో ఐరన్, మాంసకృత్తులు పుష్కలంగా ఉంటాయి. రోజూ కొంత మొత్తంలో బెల్లం తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు దూరమవుతాయి.

2. ఇక బెల్లం, శనగ పప్పు కలిపి తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా ఇది శరీరంలోని కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది.

3. ఈ రెండింటిలోనూ ఉండే పొటాషియం గుండెపోటు రాకుండా కాపాడుతుంది. బీపీని కంట్రోల్‌లో ఉంచుతుంది.

4. కొంత మందికి జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటుంది. ఏదైనా త్వరగా మర్చిపోతుంటారు. అలాంటి వారు ఈ బెల్లం, శనగ పప్పు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది.

5. సమ్మర్ వచ్చింది అంటే .. చాలా మందికి ఒంట్లో వేడి కారణంగా మూత్రం సమస్య వస్తుంది. మంటగా ఉండటం, పొత్తికడుపులో నొప్పి.. ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటారు. అలాంటి సమస్యలకు ఈ బెల్లం, శనగపప్పు మిశ్రమం చెక్ పెడుతుంది.

6. బెల్లం, శనగ పప్పులో భాస్వరం సమృద్ధిగా ఉంటుంది. ఇది దంతాలు చెడిపోకుండా కాపాడుతుంది. అలాగే నోటి దుర్వాసన సమస్యకు కూడా దీంతో చెక్ పెట్టచ్చు.

7. రోజూ ఉదయం వ్యాయామం చేసిన తర్వాత, మన శరీరంలో కేలరీలు తగ్గుతాయి. వ్యాయామం అయిపోగానే బెల్లం, శనగపప్పు తినడం వల్ల మంచి కేలరీలు అందుతాయి.

Read more:

1. పుట్టగొడుగులతో జ్ఞాపకశక్తి మెరుగు.. అల్జీమర్స్ నివారణ సాధ్యమే!

Advertisement

Next Story

Most Viewed