RAKHI SPECIAL: రాఖీ కట్టి ఈ బాదం కొబ్బరి బర్ఫీ తినిపించండి.. నోరూరించే మిఠాయి 10 మినిట్స్‌లో ఇలా రెడీ చేయండి

by Anjali |
RAKHI SPECIAL: రాఖీ కట్టి ఈ బాదం కొబ్బరి బర్ఫీ తినిపించండి.. నోరూరించే మిఠాయి 10 మినిట్స్‌లో ఇలా రెడీ చేయండి
X

దిశ, ఫీచర్స్: రాఖీ కట్టడం ఎంత ముఖ్యమో రాఖీ కట్టాక బ్రదర్‌కు స్వీట్ తినిపించడం కూడా అంతే ముఖ్యం. రాఖీ కట్టి స్వీట్ తినిపించడం సంప్రదాయంగా వస్తోన్న ఆచారం. కాగా నేడు ఎక్కువ మంది స్వీట్స్ షాపుల్లో కొంటుంటారు. షాపులో కొనే వీలు లేనివారు బాదం కొబ్బరి బర్ఫీ స్వీట్ ను ఇలా పది నిమిషాల్లో ఇంట్లోనే తయారు చేసుకోండి. తయారీ విధానమెలాగో ఇప్పుడు చూద్దాం..

బాదం కొబ్బరి బర్ఫీ స్వీట్ కు కావలసిన పదార్థాలు:

ఒక గ్లాస్ మిల్క్, తాజాగా కొబ్బరి ముక్కలు, సరిపడ షుగర్, యాలకుల పొడి-1 టీస్పూన్, దేశీ నెయ్యి-పావు కప్పు తీసుకోండి.

తయారీ విధానం..

ఫస్ట్ కొబ్బరి ముక్కలను చిన్నగా కట్ చేసి మిక్సీ పట్టండి. బాదం కూడా సపరేట్ గా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత వాటిని ఒక గిన్నెలో ఉంచండి. తర్వాత పాలు కాగబెట్టండి. ఒక ప్యాన్ తీసుకుని దానిలో పంచదార, వాటర్ యాలకుల ఫౌడర్ వేసి పాకం వచ్చేదాక కలపండి. అదాయ్యాక మరో కడాయి తీసుకుని నెయ్యి వేసి అందులో బాదం పొడి వేయండి. ఎక్ట్ర్సా జీడిపప్పు, పిస్తా లాంటివి వేసుకుంటే వేసుకోండి. 2 మినిట్స్ తర్వాత కొబ్బరి పొడి యాడ్ చేయండి. గ్యాస్ సిమ్ పెట్టి పాలు పోయండి. మిల్క్ ఆ మిశ్రమానికి పట్టే వరకు కలుపుతూనే ఉండండి. ఈ స్వీట్ అంతా గట్టిగా అయ్యాక మరికొంచెం నెయ్యి యాడ్ చేసి చతురస్త్రం లేదా డైమండ్ షేప్‌లో కట్ చేసుకోండి. అంతే బాదం కొబ్బరి బర్ఫీ స్వీట్ రెడీ. నోరూరించే ఈ స్వీట్ మీ సోదరులకు బాగా నచ్చుతుంది.

Advertisement

Next Story

Most Viewed