ఫ్యూచర్ మార్స్ మిషన్‌కు పూర్తిగా మహిళా సిబ్బంది..

by Anjali |   ( Updated:2023-05-09 13:25:36.0  )
ఫ్యూచర్ మార్స్ మిషన్‌కు పూర్తిగా మహిళా సిబ్బంది..
X

దిశ, ఫీచర్స్: ఫ్యూచర్ మార్స్ మిషన్ కోసం మొత్తం మహిళా సిబ్బందిని ఎంపిక చేయడమే సరైన నిర్ణయమని తాజా అధ్యయనం పేర్కొంది. జర్మనీలోని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA)కి సంబంధించిన స్పేస్ మెడిసిన్ టీమ్ పరిశోధకులు పురుషుల కంటే మహిళలు మరింత సమర్థవంతంగా ఉండటమే కాకుండా.. తక్కువ వనరులతోనే సక్సెస్‌ఫుల్‌గా మిషన్ కంప్లీట్ చేస్తారని కనుగొన్నారు. స్త్రీలు తక్కువ ఆక్సిజన్‌ను క్లెయిమ్ చేస్తూ.. తక్కువ కార్బన్ డై ఆక్సైడ్‌ను ఉత్పత్తి చేస్తారని, వారికి పురుషుల కంటే తక్కువ ఆహారం అవసరం అవుతుందని వివరించారు. ఇక మహిళలు క్యాప్సూల్‌లో తక్కువ స్థలాన్ని తీసుకుంటారని, లైఫ్ సపోర్ట్ సిస్టమ్‌ల వంటి ముఖ్యమైన వస్తువుల కోసం గదిని కూడా ఇవ్వగలరని వివరించారు.

గతంలో మార్స్‌ మిషన్ సమయంలో నలుగురు వ్యక్తులతో కూడిన మహిళా సిబ్బంది మిషన్ 1,080 రోజులు కొనసాగిందని, వారికి 1.69 కిలోల తక్కువ ఆహారం సరిపోయిందని, రూ. 12వేల కోట్లకు పైగా నిధులు మిగిలాయని వివరించారు పరిశోధకులు. 480 మిలియన్ కిలోమీటర్లు ప్రయాణించే అంతరిక్ష నౌకలో అంగారక గ్రహానికి సాధారణ ప్రయాణం ఏడు నెలలు పడుతుంది. అయితే అక్కడ మానవుల ఆహార వనరులు లేనందున, వ్యోమగాములు తమ పర్యటనా కాలానికి సరిపోయే వనరులను తీసుకువెళ్లవలసి ఉంటుంది. తద్వారా అంతరిక్ష ప్రయాణానికి ప్రతి ఒక్క వేరియబుల్ ముఖ్యమైనది. అయితే హ్యూమన్ మార్స్ మిషన్‌కు కనీసం రెండు దశాబ్దాల సమయం ఉన్నప్పటికీ.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతరిక్ష సంస్థలకు ఈ అధ్యయనం హెల్ప్ కానుంది.

Also Read..

Be careful: తలకు షాంపు రాస్తున్నప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా!

Advertisement

Next Story

Most Viewed