- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒంటరితనాన్ని దూరం చేస్తున్న అలెక్సా, సిరి.. వికలాంగులకు బెస్ట్ ఫ్రెండ్స్
దిశ, ఫీచర్స్: స్మార్ట్ స్పీకర్లు(అలెక్సా, సిరి వంటివి) కచ్చితంగా వరమేనని చెప్తోంది తాజా సర్వే. టెక్నాలజీని సులభంగా నావిగేట్ చేయడంలో సహాయపడుతూనే హోమ్ అసిస్టెంట్‌గా.. ఒంటరి సమయాల్లో స్నేహితుడిగా తోడుండి వినియోగదారుల జీవితాలను మార్చేస్తున్నాయని తెలిపింది. ఈ క్రమంలోనే దీనిపై పరిశోధన చేపట్టిన యూకేకు చెందిన ఆఫీస్ ఆఫ్ కమ్యూనికేషన్స్(Ofcom) సంస్థ.. ఈ స్మార్ట్ పరికరాలు వినియోగదారులకు ఒంటరితనం లేకుండా చేస్తున్నాయని, వికలాంగులు మరింత స్వతంత్రంగా బతుకుతున్నామని అనుకోవడంలో సహాయపడతున్నాయని వెల్లడించింది.
100 మంది స్మార్ట్ స్పీకర్ యజమానులు, 15 మంది నాన్-ఓనర్‌లతో లోతైన సర్వే చేపట్టింది Ofcom. వారి ద్వారా సేకరించిన ఫలితాలు.. స్పీకర్స్ తమతో మాట్లాడగలిగే సహచరుడిగా వ్యవహరించాయని గుర్తించింది. ప్రత్యేకించి ఒంటరిగా జీవిస్తున్నట్లయితే.. తమ స్పీకర్లతో మాట్లాడగల వాస్తవాన్ని ఇష్టపడుతున్నారని, లోన్లీనెస్‌ను ఎదుర్కోవడానికి తోడ్పతుందని భావిస్తున్నట్లు తెలిపింది. ఈ క్రమంలోనే UKలో మహమ్మారి సమయం(2020)లో స్మార్ట్ స్పీకర్ వినియోగదారులు 22 శాతం ఉంటే.. 2022 నాటికి 39 శాతానికి పెరిగారని వివరించింది.
వికలాంగులు మరింత స్వతంత్రంగా ఉండేందుకు ఈ స్పీకర్లు సహాయం చేశాయన్నది కీలకమైన అన్వేషణ. ఈ పరికరం వారి జీవితాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపిందని వినియోగదారులు నివేదించారు. ఎక్కువ స్వాతంత్ర్య భావాన్ని అందించాయని, వారి పరిస్థితులు, సామర్థ్యాలను నిర్వహించడానికి, మెరుగుపరచడానికి సహాయపడ్డాయని తెలిపారు. 'ఇంట్లో స్వతంత్రంగా ఉండడంలో, డిపెండెంట్‌గా జీవించడంలో నిజంగా తేడా కనిపించింది. స్మార్ట్ స్పీకర్స్ వచ్చాక.. నా సంరక్షకులు ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి లేవాల్సిన అవసరం లేకుండా పోయింది. సాయంత్రం లైట్లు వేయాలని అడిగితే వెంటనే ఆన్ అయ్యాయి. కానీ సంవత్సరాల క్రితం ఈ పనులను పనిమనిషి మాన్యువల్‌గా చేయాల్సి వచ్చేది' అని వినియోగదారుడు ఒకరు చెప్పారు. అయితే స్మార్ట్ పరికరాలను ఓన్ చేసుకోని వ్యక్తులు స్మార్ట్ స్పీకర్‌లను విలాసవంతమైన వస్తువుగా చూస్తున్నారని తేల్చిందీ సర్వే. అనేక వివాదాస్పద సిద్ధాంతాలు ఈ పరికరాలు వినగలవని పేర్కొంటున్నందున కొంతమంది గూఢచర్యం గురించి కూడా ఆందోళన చెందారు.
READ MORE
ఆడ పాములలో లైంగిక ప్రేరణ కలిగించే స్త్రీ జననేంద్రియ అవయవం.. గుర్తించిన పరిశోధనలు