- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆల్కహాల్ తీసుకుంటే ముఖం ఎర్రబడుతుందా?.. ప్రాణాంతకమే..?
దిశ, ఫీచర్స్: సాధారణంగా ఆల్కహాల్ తీసుకున్న తర్వాత కొందరి శరీరం, ముఖం ఎర్రగా మారిపోతుంది. దీన్నే ఆల్కహాల్ ఫ్లషింగ్ రియాక్షన్ లేదా ఆసియన్ గ్లో అని పిలుస్తుంటారు. ఇది ఆల్డిహైడ్ డీడ్రోజినేస్ 2 (ALDH2) అనే ఎంజైమ్ లోపం ద్వారా సంక్రమించే జన్యుపరమైన ఫలితం కాగా దీన్ని ALDH2*2 అని కూడా అంటారు. ప్రపంచ జనాభాలో దాదాపు 8 శాతం మందిని ప్రభావితం చేసే ఈ జన్యు వైవిధ్యం ప్రాణాంతక ప్రభావాలను కలిగిస్తుందని గుర్తించారు పరిశోధకులు. ఈ జీన్ వేరియంట్ ఉన్నవారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని.. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే మద్యపాన అలవాట్లను పునఃపరిశీలించుకోవాలని సూచిస్తున్నారు.
ఆల్కహాల్ వినియోగానికి ప్రతిస్పందనగా ఈ వేరియంట్ రక్తనాళాల వాపును కలిగిస్తుంది. శరీరం అంతటా రక్త ప్రవాహాన్ని పరిమితం చేసి, కొరోనరీ ఆర్టరీ వ్యాధికి దారితీయవచ్చు. ప్రయోగంలో ఈ వేరియంట్‌ను కలిగిన ఎలుకలు వాస్కులర్ డిలేటేషన్‌ను బలహీనపరిచాయని, వాటికి ఆల్కహాల్‌తో చికిత్స చేసినప్పుడు వాస్కులర్ పరిమాణం విస్తరించిందని తెలిపారు. పెరిగిన వాస్కులర్ మందం.. బలహీనమైన వాస్కులర్ సంకోచం, విశ్రాంతిని ప్రదర్శించాయి. అంటే ALDH2*2 ఉన్న వ్యక్తులు బలహీనమైన వాస్కులర్ ఫంక్షన్‌తో బాధపడుతున్నారని.. ఆల్కహాల్ కొద్ది పరిమాణంలో తీసుకున్నా ప్రమాదకరమేనని హెచ్చరిస్తున్నారు. ప్రత్యేకించి గుండె జబ్బులు, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్‌తో కూడిన ఫ్యామిలీ హిస్టరీ ఉంటే వెంటనే ఈ అలవాటును మానుకోవాలని సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి: