సర్‌ప్రైజ్ డిస్కవరీ : వినికిడి పరికరాలుగా పనిచేసే ఎయిర్ పాడ్స్

by Mahesh |
సర్‌ప్రైజ్ డిస్కవరీ : వినికిడి పరికరాలుగా పనిచేసే ఎయిర్ పాడ్స్
X

దిశ, ఫీచర్స్: హయ్యర్ ఎండ్ ఎయిర్‌పాడ్స్ తేలికపాటి నుంచి మితమైన వినికిడి లోపమున్న పెద్దలకు హియరింగ్ ఎయిడ్స్‌గా పనిచేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఇప్పుడు సాంప్రదాయ వినికిడి పరికరాలకు బదులు ఆపిల్-నిర్మిత ఇయర్‌బడ్స్‌ పరీక్షా దశలో ఉన్నట్లు కొత్త పరిశోధన వెల్లడించింది. అధిక ధర, వాటితో పాటు వచ్చే సామాజిక కళంకం వంటి సమస్యల కారణంగా తమకు అవసరమైన హియరింగ్ ఎయిడ్స్ వినియోగించని మిలియన్ల మంది జీవితాలను ఈ పరిశోధనలు(ఇయర్‌బడ్స్) మార్చగలవు.

'ఈ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ ఖచ్చితమైనవి కావు. కానీ ప్రొఫెషనల్ వినికిడి పరికరాలకు యాక్సెస్ లేని చాలా మంది రోగులకు ఇవి మంచి ప్రారంభ స్థానం' అని తైవాన్‌లోని తైపీ వెటరన్స్ జనరల్ హాస్పిటల్‌కు చెందిన ఓటోలారిన్జాలజిస్ట్ యెన్-ఫు చెంగ్ వెల్లడించారు. ఈ ఇయర్‌బడ్స్‌తో జీవన నాణ్యతలో పెరుగుదలను చూస్తారని తెలిపారు. అధ్యయన ప్రయోజనాల కోసం ప్రీమియం హియరింగ్ ఎయిడ్స్(తైవానీస్ మార్కెట్‌లో US$10,000), ప్రాథమిక వినికిడి పరికరాలు (US$1,500), AirPods ప్రో ఇయర్‌బడ్స్(US$249), AirPods 2( US$129)తో తేలికపాటి నుంచి మితమైన వినికిడి లోపమున్న 21 మంది పార్టిసిపెంట్స్ పరీక్షించబడ్డారు. యాపిల్ ఐఫోన్స్‌కు లింక్ చేయబడిన ఈ ఎయిర్‌పాడ్స్‌లో 'లైవ్ లిసన్' అనే ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ యాంప్లిఫైయర్ యాప్ ఇన్‌స్టాల్ చేయబడింది. ఈ మేరకు వాలంటీర్లకు చిన్న వాక్యాలను చదివి వినిపించి వాటిని తిరిగి చెప్పమని అడిగారు.

AirPods 2, AirPods ప్రో రెండూ సౌండ్స్‌ను పెంచే Live Listen టెక్నాలజీ కలిగి ఉండగా.. ప్రో మోడల్‌లో మాత్రమే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది. ఇది కొన్ని బాహ్య శబ్దాలను గుర్తించి బ్లాక్ చేస్తుంది. వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ రెండు సెట్ల మధ్య వ్యత్యాసాన్ని వివరించడానికి ఇది సాయపడవచ్చు. ఈ అన్వేషణ వినికిడి సాధనాలు, నిర్దిష్ట దిశల్లో మరింత సున్నితంగా ఉండే వ్యక్తిగత సౌండ్ యాంప్లిఫికేషన్ ఉత్పత్తులను రూపొందించడానికి ఇంజనీర్స్‌ను ప్రేరేపిస్తుంది. సమీప భవిష్యత్‌లో 'గూగుల్ నుంచి సామ్‌సంగ్, సోని' వరకు ప్రతీ కంపెనీ ఈ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ తయారు చేసే అవకాశం ఉంది.

Advertisement

Next Story