- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గాలిలో శిశువుల కిల్లర్స్.. చైనాలో పెరుగుతున్న మరణాల రేటు
దిశ, ఫీచర్స్: కలుషితమైన గాలిలోని సూక్ష్మకణాలు కడుపులో ఉండగానే శిశువుల మరణాలకు దారితీస్తున్నాయని తాజా అధ్యయనం పేర్కొంది. శిలాజ ఇంధనాలను కాల్చినప్పుడు ఉత్పత్తి అయ్యే 2.5 మైక్రాన్ల కంటే తక్కువ పరిమాణంలో ఉండే కణాల(PM2.5)కు ఎక్స్‌పోజ్ కావడం మూలంగా ఇలా జరుగుతుందని స్పష్టం చేసింది. దాదాపు 137 దేశాల డేటాను విశ్లేషించిన ఈ అధ్యయనం.. ఈ కణాలు చైనాలో ఏటా 64వేల కడుపులో పిండాలను మింగేస్తున్నాయని తెలిపింది. 2015 సంవత్సరంలో లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలో 40శాతం మరణాలకు దారితీసినట్లు పేర్కొంది.
నేచర్ కమ్యూనికేషన్స్ అనే సైంటిఫిక్ జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం, ప్రపంచంలోని 98% ప్రసవాలు జరిగే దేశాలన్నింటిని విశ్లేషించిన అధ్యయనంలో, PM2.5కి సంబంధించిన పిండం మరణాల్లో చైనా నాల్గవ స్థానంలో నిలిచింది. జు టావో నేతృత్వంలోని పెకింగ్ యూనివర్శిటీ పరిశోధకులు.. వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి గత దశాబ్దంలో చైనా అధికారులు అనుసరించిన చర్యలు అటువంటి మరణాల సంఖ్యను తగ్గించాయని వివరించారు. అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్న గాలి నాణ్యత లక్ష్యాలను చేరుకోవడం వల్ల ఇలాంటి పరిస్థితులను నిరోధించవచ్చని తెలిపారు.
ప్రసవానికి కలుషితమైన గాలి ఎలా కారణమవుతుందో విస్తృతంగా తెలిసినప్పటికీ, నమోదు చేయబడిన పిండం మరణాల సంఖ్యను ఖచ్చితంగా లెక్కించడానికి నిర్వహించబడిన మొదటి అధ్యయనం ఇది. 2020 నివేదికలో, UNICEF ఈ దృగ్విషయాన్ని 'నిర్లక్ష్యం చేయబడిన విషాదం'గా అభివర్ణించింది.
అధ్యయనం మొత్తం మీద PM2.5కి గురికావడంలో 10 µg/m3 పెరుగుదల ఫలితంగా ఈ కేసులు 11% పెరిగాయి. కాలుష్య కణాలు మావి గుండా వెళుతున్నప్పుడు.. 'కోలుకోలేని పిండ నష్టం' కలిగించవచ్చని పరిశోధకులు పేర్కొన్నారు. ఇది పిండానికి ఆక్సిజన్ ప్రసారానికి భంగం కలిగిస్తుందని కూడా అనుమానిస్తున్నారు. లంగ్ ఇన్ఫెక్షన్, ఆస్తమా, హార్ట్ డిసీజ్‌కు కారణమవుతాయని తెలిపారు.
READ MORE
సరదాగా ఉండట్లేదని జాబ్ నుంచి పీకేశారు.. కోర్టులో గెలిచిన ఉద్యోగి
- Tags
- Lifestyle