Chess : ప్రతిభ ఉన్నా చెస్‌లో ఓడిపోతున్నారా? దీని వెనుక భయంకరమైన కారణం..

by Prasanna |   ( Updated:2023-02-09 17:35:25.0  )
Chess : ప్రతిభ ఉన్నా చెస్‌లో ఓడిపోతున్నారా? దీని వెనుక భయంకరమైన కారణం..
X

దిశ, ఫీచర్స్ : చెస్ ఆటగాళ్లు అధిక స్థాయి వాయు కాలుష్యానికి గురైనప్పుడు గేమ్‌లో బిగ్గెస్ట్ మిస్టేక్స్ చేస్తారని కనుగొన్నారు MIT పరిశోధకులు. గాలి నాణ్యత చెడ్డగా ఉన్నప్పుడు అధ్వాన్నంగా పనిచేస్తారని గుర్తించారు. ఎయిర్ పొల్యూషన్‌లో స్వల్ప పెరుగుదల వల్ల పొరపాటు చేసే సంభావ్యత 2.1 శాతం పెరుగుతుందని, తప్పుల పరిమాణంలో 10.8 శాతం పెరుగుదల కూడా ఉంది.

అధ్యయనంలో భాగంగా 2017 నుంచి 2019 వరకు జర్మనీలో మూడు ఎనిమిది వారాల టోర్నమెంట్‌లలో 121 మంది చెస్ ప్లేయర్‌ల ఆటలను విశ్లేషించారు. పరిసర కార్బన్ డై యాక్సైడ్, గాలిలోని సూక్ష్మరేణువులు, ఉష్ణోగ్రతను కొలవడానికి టోర్నమెంట్‌ల వేదికల లోపల సెన్సార్‌ల నుంచి సేకరించిన గాలి నాణ్యత డేటాను ఉపయోగించారు. ఆటగాడి పనితీరును తెలుసుకునేందుకు ప్రతి కదలిక నాణ్యతను విశ్లేషించే చెస్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించారు. క్యూబిక్ మీటర్ గాలికి 14 నుంచి 70 మైక్రోగ్రాముల వరకు సూక్ష్మ రేణువుల సాంద్రత ఉంటుందని.. ఇది U.S. వీధుల్లో కనిపించే స్థాయిలకు దాదాపు సమానమని తెలిపారు. ప్లేయర్‌ల నైపుణ్య స్థాయిలు, బ్యాక్‌గ్రౌండ్ శబ్దం వంటి ఆటను ప్రభావితం చేసే బాహ్య కారకాలను లెక్కించిన తర్వాత.. పెరిగిన వాయు కాలుష్యం, ఆటగాడి పనితీరు మధ్య బలమైన సహసంబంధం ఉందని కనుగొన్నారు. గాలిలో సూక్ష్మ రేణువుల అధిక స్థాయిలు ఆటగాళ్లు మరింత తప్పులు చేయడానికి దారితీశాయన్నారు. ప్లేయర్స్ టైమ్ ప్రెజర్‌కు లోనవుతున్నప్పుడు మాత్రమే సమస్యలు తీవ్రమవుతాయని కనుగొన్నారు. నిబంధనల ప్రకారం 110 నిమిషాల్లో 40 కదలికలు చేయాలి. కానీ క్యూబిక్ మీటరుకు 10 మైక్రోగ్రాముల వాయు కాలుష్యం పెరుగుదల 31 నుంచి 40 కదలికలలో 3.2 శాతం ఎర్రర్‌లకు దారితీసింది.

మొత్తానికి ఎయిర్‌ పొల్యూషన్‌ వ్యక్తుల పనితీరుకు కారణమవుతోందని అంటున్నారు పరిశోధకులు. ఒకే టోర్నమెంట్ రౌండ్‌లో పోల్చదగిన ప్రత్యర్థులు.. వివిధ స్థాయిల గాలి నాణ్యతకు గురికావడం వల్ల మూవ్ క్వాలిటీ, డెసిషన్ క్వాలిటీలో తేడా ఉందన్నారు. ఈ కొత్త అధ్యయనం పేలవమైన గాలి నాణ్యత జ్ఞానపరమైన క్షీణతకు దారితీస్తుందని చూపించే సాక్ష్యాల జాబితాలో చేరింది.

ఇవి కూడా చదవండి:

బ్రెజిల్‌లో డ్రాగ్ కింగ్ పోటీల్లో ప్రతిభ చాటుతున్న 'ఎల్‌జీ‌బీటీ' కమ్యూనిటీ

Advertisement

Next Story