- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Air pollution : వామ్మో వాయు కాలుష్యం.. సిరల్లో రక్తం గడ్డ కట్టేచాన్స్!
దిశ, ఫీచర్స్ : వాయు కాలుష్యం.. మన దేశంలో రోజు రోజుకూ పెరుగుతోందని నివేదికలు పేర్కొంటున్నాయి. పైగా ఇది ఊపిరి తిత్తుల సమస్యలు మొదలుకొని గుండె జబ్బులు, COPD, క్యాన్సర్ సహా పలు ఇతర అనారోగ్యాల రిస్క్‌ను పెంచుంతుందన్న విషయం తెలిసిందే. కాగా దీనివల్ల చర్మం కింద ఉండే సిర(డీప్ వీన్స్)ల్లో బ్లడ్ క్లాట్ అయ్యే ముప్పు మరింత పెరుగుతుందని తాజాగా యూఎస్ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. జర్నల్ బ్లడ్ (journal Blood) మ్యాగజైన్‌లో పబ్లిషైన వివరాల ప్రకారం.. భారత దేశంతో సహా పలు దేశాల్లోని మెట్రో పాలిటన్ సిటీస్‌లో నివసించే 6,650 మందిని, వారు తరచుగా ఎయిర్ పొల్యూషన్‌కు గురికావడంవల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారనే విషయాన్ని పరిశోధకులు 17 ఏండ్లపాటు పరిశీలించారు.
వాయు కాలుష్యం ప్రభావాలపై అనేక కోణాల్లో పరిశీలించిన రీసెర్చర్స్ తరచుగా వాయు కాలుష్యానికి గురవుతున్న 6, 650 మందిలో 3.7% మందికి చర్మం లోపలి సిరల్లో రక్తం గడ్డ కడుతున్నట్లు (thromboembolism) కనుగొన్నారు. గాలిలోని విష పదార్థాల ప్రభావంతో ఈ రిస్క్ 39% శాతం పెరుగుతోందని గుర్తించారు. ముఖ్యంగా తాము పరిశీలించిన వారిలో 120 నుంచి 174 శాతం మంది నైట్రోజన్ డై ఆక్సైడ్లు (NO2), నైట్రోజన్ ఆక్సైడ్ల (NOx) ప్రభావంతో శ్వాసకోశ వ్యాధులు, క్యాన్సర్, ఆర్టెరీ బ్లాక్స్, అలాగే సిరల్లో రక్తం గడ్డ కట్టడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని తేల్చిన పరిశోధకులు, వాయు కాలుష్యమే అందుకు ప్రధాన కారణమని చెబుతున్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే.. ఎయిర్ పొల్యూషన్ల కట్టడికి ప్రజలు, ప్రభుత్వాలు విధానపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. కాగా వాయు కాలుష్యం ఇంకా ఏయే రకాల ప్రభావాలను కలిగిస్తుందో కూడా తాము మరిన్ని అధ్యయనాలు కొనసాగిస్తామని కూడా వెల్లడించారు.