- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Afternoon sleep: మధ్యాహ్నం పూట నిద్ర ముంచుకొస్తోందా..? ఈ టిప్స్ పాటిస్తే బయటపడొచ్చు!
దిశ, ఫీచర్స్ : ‘పగటి పూట నిద్ర పనికి చేటు’ అంటారు పెద్దలు. ముఖ్యంగా మధ్యామ్నం వేళ కునుకు తీసే అలవాటు కారణంగా పలువురు ఆ రోజు పనులు పూర్తిగా చేయలేకపోతుంటారు. చాలామంది కావాలని నిద్రపోరు కానీ.. స్లీప్ డిజార్డర్ కారణంగానో, శారీరక సమస్యలతోనో అలా జరగవచ్చు. మరి కొందరు బాడీ సిచ్యువేషన్ డిమాండెడ్‌గా కునుకు తీయకుండా ఉండలేకపోతారు. అయితే ఆ తర్వాత నిద్రవల్ల నష్టపోయిన పెండింగ్ వర్క్ పూర్తి చేయలేక అవస్థలు పడుతుంటారు. ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే ఆఫ్టర్ నూన్ స్లీపింగ్ హ్యాబిట్‌ను దూరం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అందుకోసం ఏం చేయాలో చూద్దాం.
* వెట్ టిష్యూ : మధ్యాహ్నం నిద్రను ఆపుకోలేని పరిస్థితిని మీరు ఎదుర్కొంటూ ఉంటే గనుక ఆఫీసుకు వెళ్లే ముందు వెట్ టిష్యూలు మీ బ్యాగులో పెట్టుకెళ్లండి. నిద్ర వచ్చినప్పుడు ఆ టిష్యూను మీ ముఖంపై మాస్క్‌లాగా వేసి కొద్ది క్షణాలు ఉంచి తీసివేయండి. దీంతో మీలో నిద్రపారిపోతుంది. ప్రశాంతంగా, ఉత్సాహంగా అనిపిస్తుంది. పైగా వీటిలో మెంతాల్, అలోవెరా గుణాలు ఉండటం కారణంగా ఇవి ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి. కూల్‌నెస్ పెంచుతాయి.
* డెస్క్ ఫ్యాన్ : ఇక రోజూ మధ్యాహ్నం పూట నిద్రపోయే అలవాటు ఉన్నట్లయితే చిన్నపాటి డెస్క్ ఫ్యాన్ మీ టేబుల్ మీద పెట్టుకోండి. మీరు నిద్రపోతున్నప్పుడు మీ ముఖానికి గాలి గట్టిగా తలిగేలా హైస్పీడ్ మీద పెట్టండి. దీంతో మీ నిద్రకు ఆటంకం కలిగి క్రమంగా ఆ అలవాటును మానుకునే చాన్స్ ఉంటుంది.
*తక్కువగా తినడం : కొందరు లంచ్ టైమ్‌లో కడుపు నిండుగా తింటుంటారు. కానీ దీనివల్ల నిద్ర ముంచుకొస్తూ ఉంటుంది. కాబట్టి ఫుల్లుగా కాకుండా.. మధ్యాహ్నం వేళ నార్మల్‌గా తినండి. శక్తినిచ్చే ఆహారాలను, కూరగాయలను, సలాడ్లను ఎంచుకోండి. కేలరీలు, చక్కెరలు తక్కువగా ఉండేలా చూసుకోండి.
* వెలుతురు ఉండేలా చూసుకోండి : కొందరు ఆఫీసులో లేదా ఇంటిలో ఎప్పుడూ కిటికీలు మూసి ఉంచుతారు. లైట్లు వేసుకుంటే పర్లేదు కానీ.. అవి కూడా కొందరు తక్కువ వెలుతురు వచ్చేలా వేస్తుంటారు. దీని కారణంగా కూడా నిద్రరావచ్చు. కాబట్టి వెలుగురు ఉండేలా చూసుకోవాలంటున్నారు నిపుణులు.
* టీ, కాఫీ తాగండి : కాఫీ, టీ తాగే అలవాటు చాలామందికి ఉంటుంది. కెఫిన్ ఎక్కువైతే మంచిది కాదు కానీ.. రోజుకు రెండు మూడు కప్పుల కాఫీ లేదా టీ తాగవచ్చని నిపుణులు చెప్తున్నారు. మధ్యాహ్నం వేళ నిద్రముంచుకొస్తుంటే గనుక ఓ కప్పు కాఫీ గానీ, టీ గానీ తాగేస్తే చాలు. రమ్మన్నా రాదు.
* స్మాల్ బ్రేక్ : మధ్యాహ్నం పూట నిద్ర ముంచుకొస్తుంటే గనుక దానిని డైవర్ట్ చేయడానికి చిన్న విరామం తీసుకోవడం కూడా బెటర్‌గా పనిచేస్తుంది. ఆ సమయంలో కాసేపు వాకింగ్ చేయడం, స్నాక్స్ తినడం, ఇతరులతో మాట్లాడటం వంటివి చేస్తూ నిద్రను డైవర్ట్ చేయవచ్చు.
* నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించడం లేదు. పాఠకుల అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.