కడుపు కాలిన తండ్రి.. కొడుకులు పట్టించుకోవట్లేదని ఆస్తిని కొండగట్టు అంజన్న పేరున రాశాడు..

by Sujitha Rachapalli |
కడుపు కాలిన తండ్రి.. కొడుకులు పట్టించుకోవట్లేదని ఆస్తిని కొండగట్టు అంజన్న పేరున రాశాడు..
X

దిశ, ఫీచర్స్ : కొడుకు పుట్టగానే వారసుడు వచ్చాడని మురిసిపోతారు తల్లిదండ్రులు. తమ ఇంటిపేరు నిలబెడతాడని నలుగురికి చెప్పుకుని తెగ సంతోషపడుతారు. ఆకాశాన్నంటేలా సంబురాలు జరుపుతారు. తమకు తిండికి ఉన్నా లేకపోయినా వాడికి మాత్రం పంచభక్ష పరమాన్నాలు పెట్టేందుకు ప్రయత్నిస్తారు. తమ కడుపు మాడ్చుకుని కొడుకును పెద్ద చదువులు చదివిస్తారు. వాడికి ఉద్యోగమొస్తే తమను సుఖపెడుతాడని కలలు కంటారు. వెంటనే పెళ్లి చేస్తే ఓ పని అయిపోతుందని ఆరాటపడుతారు. కానీ అక్కడే అసలు కథ మొదలు అవుతుంది.

కొడుకు మరొకడు అయిపోతాడు. కన్న తల్లిదండ్రులను పట్టించుకునే టైమ్ లేనట్లుగా బిహేవ్ చేస్తాడు. కనీసం పట్టెడన్నం కూడా పెట్టేందుకు చేతులు రాని పరిస్థితికి వచ్చేస్తాడు. ఇక ఇద్దరు కొడుకులు ఉంటే సరే సరి.. తల్లిదండ్రులకు నువ్వు తిండి పెట్టు అంటే నువ్వు ఎందుకు పెట్టవని గొడవ పడతారు. పస్తులు ఉంచుతారు. కానీ ఆస్తిని పంచుకునేందుకు మాత్రం ముందుంటారు. అయితే ఇలాంటి పరిస్థితి ఎదురైన ఓ తండ్రి తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సిద్ధిపేట జిల్లా చిన్న కోడూరు మండలం అలీపూర్‌కు చెందిన బాలయ్య.. కనిపెంచిన కుమారులు తిండి కూడా పెట్టట్లేదని మనస్తాపానికి గురయ్యాడు. తీవ్రవేదనతో కొండగట్టు అంజన్న సన్నిధికి చేరి.. ఆయనకే ఆస్తి మొత్తం సమర్పించాలని నిర్ణయించుకున్నాడు. ఆలయం హుండీలో ఆస్తి పత్రాలు వేసేందుకు వెళ్లాడు. కానీ అలా కాకుండా చట్టపరంగా ఈ ప్రాసెస్ జరగాలని చెప్పారు పూజారులు. దీంతో ఇందుకు ఏర్పాట్లు చేయాలని బాలయ్య అధికారులను కోరాడు.

Advertisement

Next Story

Most Viewed