Smiling Depression : నవ్వుతూ బాధను అనుభవిస్తున్నారు.. మరింత డేంజరస్..

by Sujitha Rachapalli |
Smiling Depression :  నవ్వుతూ బాధను అనుభవిస్తున్నారు.. మరింత డేంజరస్..
X

దిశ, ఫీచర్స్: సాధారణంగా డిప్రెషన్ లో ఉన్న వ్యక్తి ముఖం విచారంగా ఉంటుంది. అతని మానసిక స్థితి సరిగ్గా లేదని చూసేవాళ్లకు అర్థమైపోతుంది. కానీ ఒక వ్యక్తి పైకి సంతోషంగా కనిపిస్తున్నా లోలోపల భాధపడుతుంటాడు. తీవ్ర వేదన, నిరాశను అనుభవిస్తుంటాడు. దీనినే స్మైలింగ్ డిప్రెషన్ అని పిలుస్తారు. మెంటల్ డిజార్డర్స్ కు సంబంధించిన డయాగ్నొస్టిక్ మాన్యువల్‌ లిస్ట్ లో ఇది లేనప్పటికీ.. చాలా నిజమైన పరిస్థితి. ఒక రకమైన డిప్రెషన్‌. రోగి తాను క్షేమంగా ఉన్నానని ఇతరులకు చెప్పవచ్చు.. అతను సంతోషంగా కనిపిస్తున్నాడు కాబట్టి నిరాశకు లోనయ్యాడని సన్నిహితులు అనుకోకపోవచ్చు. తమ సహాయం అవసరమని గుర్తించకపోవచ్చు.

లక్షణాలు

1. బరువు, నిద్రలో మార్పులు

మాలిక్యులర్ సైకియారిటీలో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం స్మైలింగ్ డిప్రెషన్ తో బాధపడుతున్న వారిలో ఆకలి తగ్గిపోతుంది. బరువులో మార్పు కనిపిస్తుంది. నిద్ర షెడ్యూల్ సరిగ్గా ఉండదు.

2. బద్ధకం

ఈ డిప్రెషన్ ఓ వింత లక్షణం కలిగి ఉంది. అది ఏమిటంటే.. రోగులు విపరీతమైన అలసటను అనుభవిస్తారు. బెడ్ పై నుంచి లేచేందుకు కూడా ఇష్టపడరు. ఒక వ్యక్తి ఒంటరిగా ఉన్నప్పుడు స్మైలింగ్ డిప్రెషన్ తరచుగా అనుభవించవచ్చు.

3. ఫోకస్ లేకపోవడం

ఫోకస్ సమస్య కూడా చిరునవ్వుతో కూడిన డిప్రెషన్ లక్షణాలలో ఒకటి. రోగులు పని, చదువు.. ఇలా దేనిపైనా దృష్టి పెట్టలేరు. సెన్సిటివ్ లేదా కోపం, చిరాకు మొదలైన మూడ్ స్వింగ్‌లను కలిగి ఉంటారు.

4. సెల్ఫ్ రెస్పెక్ట్ తగ్గిపోవడం

ఈ రోగంతో బాధపడుతున్న వారిలో ఆత్మ విశ్వాసం సన్నగిల్లుతుంది. తమను తాము తక్కువ అంచనా వేసుకుంటారు. ఒకప్పుడు ఇష్టంగా చేసే పనులను అస్సలు ఇష్టపడరు. వాటిని చేసేందుకు టైం కేటాయించరు.

ఎవరికి ప్రమాదం??

స్మైలింగ్ డిప్రెషన్ ఎవరికైనా రావచ్చు. కానీ పర్ఫెక్షనిస్ట్ గా ఉండాలనుకునే, పరువు ప్రతిష్టల కోసం పాకులాడే వారికి ఎక్కువ ప్రమాదం ఉంటుందని చెప్తున్నారు నిపుణులు. అందుకే ముఖంపై చిరునవ్వుతో వారి నిస్పృహ లక్షణాలను దాచేస్తారు. చాలా సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తారు. ఎవరు ఏం అనుకుంటారేమోననే భయంతో ఇలా చేస్తారు. సెంటర్ ఫర్ అడిక్షన్ అండ్ మెంటల్ హెల్త్ నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. ఒక వ్యక్తి తన వల్ల బయట వాతావరణం ఎలా ప్రభావితం అవుతుందో అనుకున్నప్పుడు తమ ఫీలింగ్స్ అణగదొక్కుతాడు. లోపల ఎలా బాధపడుతున్నాడో పైకి కనిపించనివ్వడు. అడిక్షన్ కూడా స్మైలింగ్ డిప్రెషన్‌కు దారితీస్తుంది. వ్యసనం అనేది ఒకరి భావోద్వేగాలను, సమస్యలను అణచివేయడానికి సహాయపడుతుంది. మరొక ప్రమాద కారకం జీవితంలో ఆకస్మిక మార్పు. విడిపోవడం లేదా వ్యక్తిగత నష్టం తరచుగా చిరునవ్వుతో కూడిన నిరాశను కలిగిస్తుంది.

డయగ్నోసిస్.. ట్రీట్మెంట్

స్మైలింగ్ డిప్రెషన్ తో బాధపడుతున్న రోగులను డయగ్నోస్ చేయడం కష్టమే. ఎందుకంటే వీరు హ్యాపీనెస్ అనే ముసుగును తగిలించుకుంటారు. అయితే ఇలాంటి రోగుల సంఖ్య రోజురోజుకు అధికం అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వర్క్ చేస్తున్న మిడిల్ ఏజ్ పర్సన్స్ లో ఎక్కువగా ఉందని.. ముందుగా గుర్తించి ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిదని చెప్తున్నారు

నిజానికి స్మైలింగ్ డిప్రెషన్ తో బాధపడుతున్నవారికి కూడా తమకు ఈ రోగం ఉందని తెలియదు. కానీ తెలియని బాధ వెంటాడుతున్నట్లు అనిపిస్తే.. నెల రోజులు అదే పరిస్థితి కంటిన్యూ అయితే మాత్రం డాక్టర్ ను సంప్రదించాలి. మీతో మాట్లాడి ఈ వ్యాధిని నిర్ధారించవచ్చు. టాక్ థెరపీ సెషన్స్, మెడిసిన్ ద్వారా క్యూర్ చేయగలరు. మ్యూజిక్, వాక్, యోగా, వ్యాయామం ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు హెల్ప్ చేయవచ్చు.

Advertisement

Next Story

Most Viewed