- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఫేమస్ టు డర్టీ.. రీల్స్ ఉచ్చులో యువతరం! జీవితంపై చెరగని ముద్ర!!
దిశ, ఫీచర్స్ : రీల్స్.. షాట్స్..పేరేదైనా సరే.. ఆన్‌లైన్‌లో పాపులర్ అయ్యేందుకు.. ఎంతో కొంత మనీ సంపాదించేందుకు.. ప్రతిభను ప్రదర్శించేందుకు.. హెల్ప్ అవుతున్న సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్. దీన్ని ఎంత బాగా యూజ్ చేస్తే అంత ఫేమ్ వస్తుంది.. ఎంత చీప్ లేదా వల్గర్‌గా వినియోగిస్తే అన్ని విమర్శలు వస్తాయి. కొందరు తమకు తెలిసిన సమాచారాన్ని అందించడం లేదా కళను ప్రదర్శించడం ద్వారా ఫాలోవర్స్‌ను సంపాదిస్తే.. మరికొందరు ఇష్టం వచ్చినట్లుగా చెలరేగిపోవడం, లిమిట్స్ దాటి రెచ్చిపోవడం ద్వారా ఫాలోయింగ్ పొందాలని తాపత్రయపడుతారు. అంటే అన్ని విషయాల్లో మంచి చెడు ఉన్నట్లే.. రీల్స్ దగ్గర కూడా ఓ వైపు గుడ్ ఉంటే మరో వైపు బ్యాడ్ కూడా ఉంది. రీల్స్.. రియల్ మనీ మేకర్స్‌గా మారుతుండటం మెచ్చుకోదగినదే. కానీ ఇందుకోసం ఎదుటి వారికి రియల్ ట్రబుల్స్ కలిగించడమే అస్సలు బాగాలేదంటున్నారు నిపుణులు. దీనివల్ల కలిగే పాజిటివ్ అండ్ నెగెటివ్ ఎఫెక్ట్స్ గురించి వివరిస్తున్నారు.
పాజిటివ్ వైబ్స్
* రీల్స్.. మోడ్రన్ ఫామ్‌లో ఉండే మాస్ కమ్యూనికేషన్స్. కాగా సరిగ్గా టార్గెట్ చేస్తే పదిహేను సెకండ్ల నిడివి గల ఈ వీడియో అయిపోయేలోపే పాపులర్ కావచ్చు.
* ఆడియన్స్‌తో ఈజీగా ఎంగేజ్ అయ్యేందుకు, తమ బ్రాండ్‌కు సంబంధించిన యూనిక్ క్వాలిటీస్‌ను షో ఆఫ్ చేసేందుకు వ్యాపారస్తులకు బెస్ట్ ప్లాట్‌ఫామ్.
* కొద్ది సెకన్ల వీడియోతో సినిమా ప్రమోషన్స్ అదిరిపోతున్నాయ్. హుక్ స్టెప్ లేదా బెస్ట్ డైలాగ్ అంటూ పాపులర్ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌తో కలిసి పెయిడ్ ప్రమోషన్స్ చేస్తున్న మూవీ టీమ్స్.. ఈజీగా జనాల్లోకి చొచ్చుకుపోగలుగుతున్నారు.
* సాధారణ జనం కూడా సెలబ్రిటీలుగా మారేందుకు అవకాశం కల్పిస్తున్నాయి రీల్స్. అంటే ఒక్క వీడియో క్లిక్ అయినా సరే ఫాలోవర్స్ భారీగా వచ్చేస్తారు. మానిటైజేషన్ ఊహించని విధంగా ఉంటుంది.
* హోమ్ మేకర్స్, యూత్, పిల్లలు ఇలా అందరికీ ఉపాధి మార్గంగా కనిపిస్తున్నాయి. అందుకే బిలియన్స్ ఆఫ్ యూజర్స్ తమకు నచ్చిన, తమకు వచ్చిన కంటెంట్‌ను ప్రదర్శించేందుకు సంకోచించడం లేదు.
* రీల్స్ వైడ్ రేంజ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్, ఎంజాయ్మెంట్కూడా అందిస్తున్నాయి. ఫన్నీ స్కిట్స్, క్రియేటివ్ పర్ఫార్మెన్స్, ట్యుటోరియల్స్, ఇన్‌స్పిరేషనల్ స్టోరీస్ అందిస్తుండగా.. డైలీ రొటీన్ నుంచి బ్రీఫ్ రిలీఫ్ అందుతుంది.
* కొత్త సమాచారాన్ని తెలుసుకోవచ్చు. కొత్త హాబీస్.. మ్యూజిక్, ఫ్యాషన్ లాంటివి నేర్చుకునే అవకాశం ఉంటుంది.
* 15 సెకన్ల నుంచి నిమిషంలోపే ఉండే రీల్స్.. వ్యూయర్స్ ఫేస్‌పై క్విక్ ఎమోషన్స్(నవ్వు, ఆశ్చర్యం, ఏడుపు)ను తీసుకురాగలవు. ఇలా ఈజీగా అర్థం చేసుకునేవిగా ఉంటాయి కాబట్టే బిజీ షెడ్యూల్స్‌లో కూడా రిఫ్రెష్ చేయగలవు.
నెగెటివ్ ఇంపాక్ట్స్
* రీల్స్‌కు అడిక్ట్ కావడం వల్ల గంటల కొద్దీ చూస్తుంటారు. టైమ్ లాస్ కావడం.. వర్క్ ప్రొడక్టివిటీ తగ్గడం జరుగుతుంది. ఇంకొందరు అయితే అవి చూడకుండా ఉండలేకపోతున్నారు.
* సోషల్ మీడియా కంటెంట్ అంటేనే ఎడిటెడ్ కంటెంట్. అయితే ఫిల్టర్‌తో కూడిన రీల్స్ చూస్తున్న వ్యూయర్స్.. అందులో ఉన్నట్లుగా తాము లేమని, తమ జీవితాలు లేవని పోల్చుకుంటూ నిరాశ, ఒత్తిడికి లోనవుతున్నారు. ముఖ్యంగా టీనేజర్స్ బాడీ షేమ్ ఫీల్ అవుతూ సూసైడ్ టెండెన్సీ ఫీల్ అవుతున్నారు.
* రీల్స్‌లో సెకన్లలో కనిపించే మోడ్రన్ లైఫ్ స్టైల్, బ్యూటీ స్టాండర్డ్స్, గ్లామరస్ టచ్.. యువకుల్లో అన్‌రియలిస్టిక్ ఎక్స్‌పెక్టేషన్స్ పెంచేస్తున్నాయి. అలా ఉండాలనే తాపత్రయంలో రియల్ లైఫ్‌లో తప్పులు చేసేందుకు కారణం అవుతున్నాయి.
* ఈ షాట్ క్లిప్స్.. ఒక సబ్జెక్ట్ లేదా టాపిక్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అందించలేవు. దీనివల్ల కాంప్లెక్స్ ఇష్యూస్ అర్థం చేసుకోవడం అసాధ్యం.
* సాధారణంగా బోర్ కొట్టినప్పుడే రీల్స్, షాట్స్ చూస్తారు. కానీ ఇలా స్క్రోల్ చేయడం వల్ల నంబర్ ఆఫ్ వేరియేషన్స్ ఉన్న కంటెంట్ సెకన్లలోనే చేంజ్ కావడం అనేది మరింత విసుగు తెప్పిస్తుందని పలు అధ్యయనాలు చెప్తున్నాయి. బ్రేక్ లేకుండా ఎమోషన్స్ షిఫ్ట్ అవుతుండటం వల్ల.. ఎమోషనల్ ఇన్‌స్టెబిలిటీ, ఫాటిగ్‌కు దారి తీస్తుంది.
* ఇక చిన్నపిల్లల విషయానికి వస్తే షార్ట్అండ్ ఫాస్ట్ బేస్డ్ కంటెంట్ చూడటం వల్ల అటెన్షన్ స్పాన్స్ తగ్గిపోతున్నాయి. ఇదే తరుచుగా జరిగితే ఒక విషయంపై ఫోకస్ చేయడం కష్టమైపోతుంది. నిజానికి కాన్సంట్రేషన్ అనేది సక్సెస్ మంత్ర.. కాగా పిల్లల్లో ఇలా జరగడం వారి భవిష్యత్తుపై ఆందోళన కలిగిస్తుందని అంటున్నారు నిపుణులు.
లిమిట్స్ క్రాస్
* రీల్స్ చేయడం వల్ల వ్యక్తిగత లాభాలు ఉండొచ్చు. ఆన్‌లైన్ టాలెంట్ చూపించుకోవడం నుంచి దాన్నే జీవనోపాధి మార్గంగా ఎంచుకోవడం వరకు.. అంతా ఓకే. తమ క్రియేటివిటీతో ప్రశంసలు పొందడం డబుల్ ఓకే. కానీ ఈ క్రమంలో చేసే వీడియోలు కొన్ని లిమిట్స్ క్రాస్ చేస్తున్నాయి. కమ్యూనికేషన్, కనెక్షన్, కంటెంట్ పెంచుకునే విధానం హద్దులు మీరుతున్నది. ఫాలోవర్స్‌ను మెప్పించేందుకు.. చేయకూడని పనులన్నీ, చేయకూడని చోట చేసేస్తున్నారు. ఇతరులను ఇబ్బంది పెడుతున్నారు.
* ఫర్ ఎగ్జాంపుల్.. వర్షం పడుతుంది. చినుకుల్లో రీల్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాలని అనుకుంది ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ. కానీ అది ఇంటి డాబాపై చేస్తే బాగుంటుంది కానీ పొద్దున్నే ఉద్యోగాలకు వెళ్లే వారికి ఆటంకం కలిగిస్తూ రద్దీగా ఉండే వీధి మధ్యలో చేస్తే ఎలా ఉంటుంది? ఆమె డ్యాన్స్ చేస్తుందని అందరు గుమిగూడటం.. జాబ్‌కు వెళ్లేవారికి లేట్ అయిపోవడం.. వాహనాలు వెళ్లకుండా అడ్డుకోవడంతో ట్రాఫిక్ జామ్.. ఇలా పెద్ద హంగామానే జరిగింది. మరో మహిళ రోడ్డు పక్కన కారు ఆపి.. రోడ్డు మధ్యలో డ్యాన్స్‌లు వేస్తూ రీల్ చేసింది. దీనివల్ల ఎంత మందికి ఇబ్బంది కలిగి ఉండొచ్చు అర్థం చేసుకోవాలి కదా.
* ఇక మెట్రోలో రీల్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఢిల్లీ, ముంబై మెట్రోలో.. జనాల మధ్యలోనే వారికి ఇబ్బంది కలిగేలా వీడియోలు షూట్ చేస్తుంటారు. ప్రైవేట్‌గా బెడ్ రూమ్‌లో చేయాల్సిన రీల్స్.. పబ్లిక్‌గా చేస్తూ జనాలు ఒకరి ముఖం మరొకరు చూసుకోకుండా ఇబ్బంది పెడుతుంటారు. ఇంకొందరు అయితే ఓ పక్క గొడవ జరుగుతుంటే.. రక్తాలు వచ్చేలా కొట్టుకుంటుంటే... దాన్ని ఆపడం పోయి.. మాకో రీల్ చేసుకునే అవకాశం లభించింది కదా అని హ్యాపీగా ఫీల్ అయిపోతుంటారు.
టాలెంట్.. సెన్సేషనలిజం
టాలెంట్‌కు సెన్సేషనలిజానికి మధ్య సన్నని గీత ఉంటుంది. పెద్దలు చెప్పినట్లు నీకు ప్రతిభ ఉంటే.. నీ ఎదుగుదలను ఎవ్వరూ అడ్డుకోలేరు. కానీ సెన్సేషన్ క్రియేట్ చేయాలనే థాట్‌లో ఇతరులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించడం మాత్రం ముమ్మాటికీ తప్పే.