ఫ్రెండ్స్ సర్కిల్ చిన్నగానే ఎందుకు ఉండాలి?

by Sujitha Rachapalli |   ( Updated:2024-10-03 16:24:57.0  )
ఫ్రెండ్స్ సర్కిల్ చిన్నగానే ఎందుకు ఉండాలి?
X

దిశ, ఫీచర్స్ : బోలెడు మంది స్నేహితులు ఉండటం గొప్పగా అనిపించవచ్చు. కానీ వారి మధ్య అంత బలమైన బంధాలు ఉండకపోవచ్చని చెప్తున్నారు నిపుణులు. అందుకే ఫ్రెండ్స్ సర్కిల్ చిన్నగా ఉండేలా చూసుకోమని సూచిస్తున్నారు. అప్పుడే అర్థవంతమైన, లోతైన కనెక్షన్స్ ఏర్పడుతాయని.. జీవిత నాణ్యతను మెరుగుపరుస్తాయని చెప్తున్నారు.

ప్రతి సంబంధానికి సమయం కావాలి. స్నేహం వికసించాలంటే.. స్నేహితులకు సమయం, కేర్ అందించాలి. తక్కువ మంది స్నేహితులతో.. ఫ్రెండ్ షిప్ కొనసాగించడం ఖచ్చితంగా సులభం అవుతుంది. ఎక్కువ సమయాన్ని వెచ్చించగలుగుతారు. ఫలితంగా స్నేహితులతో బలమైన సంబంధాలను ఏర్పరచుకోగలుగుతారు.

ఒక వ్యక్తి తాము ఆధారపడగలిగే స్నేహితులు ఉన్నారని తెలుసుకోవడం భరోసాగా అనిపిస్తుంది. ఫలితంగా అటువంటి వ్యక్తులు మెరుగైన సంతృప్తి, మానసిక ఆరోగ్యం పొందుతారు. తక్కువ స్నేహితులు ఉన్నప్పుడు జీవితంలో కొంత సానుకూలతను అనుభవిస్తారు.

ఒక వ్యక్తికి పెద్ద సంఖ్యలో స్నేహితుల సమూహం ఉంటే.. ఇతర విషయాలకు సమయం కేటాయించలేకపోవచ్చు, ఎందుకంటే అనేక స్నేహాలను కొనసాగించడం ఒక కళ. ఇందుకు సమయం కూడా అవసరం. దీనికి విరుద్ధంగా ఒక వ్యక్తికి తక్కువ మంది స్నేహితులు ఉంటే.. జీవితంలోని వివిధ అంశాల మధ్య మంచి సమతుల్యతను సాధించే అవకాశం ఉంది.

Advertisement

Next Story

Most Viewed