Anti Rape Device : అత్యాచారానికి ప్రయత్నిస్తే... అవి కట్ అయిపోతాయ్.. కొత్త డివైజ్ కనిపెట్టిన డాక్టర్

by Sujitha Rachapalli |
Anti Rape Device : అత్యాచారానికి ప్రయత్నిస్తే... అవి కట్ అయిపోతాయ్.. కొత్త డివైజ్ కనిపెట్టిన డాక్టర్
X

దిశ, ఫీచర్స్ : దేశంలో అత్యాచారాల రేటు పెరిగిపోతుంది. ప్రతిరోజూ ఇలాంటి సంఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. కానీ పరిష్కారం ఏంటి? బాధితులకు న్యాయం జరగాలంటే ఏళ్లకు ఏళ్లు వెయిట్ చేయాలా? అసలు అలాంటి పరిస్థితే రాకుండా ఉంటే బాగుంటుంది కదా? ఇలాంటి ఆలోచనే చేశారు సౌత్ ఆఫ్రికాకు చెందిన Dr. Sonette Ehlers. సెక్సువల్ వాయిలెన్స్ కు వ్యతిరేకంగా ధైర్యంగా నిలబడిన ఆమె చక్కని సొల్యూషన్ తో ముందుకు వచ్చింది. మగ మృగాలకు చుక్కలు చూపించేందుకే యూనిక్ డివైజ్ డిజైన్ చేసింది.

ఊహించలేని ప్రమాదం నుంచి కాపాడేందుకు అమ్మాయిలకు పెప్పర్ స్ప్రే లాంటివి సరిపోవు. అందుకే యాంటీ రేప్ డివైజ్ రూపొందించింది. Rape-aXe అనేది పదునైన ముళ్లతో కూడిన రబ్బరు తొడుగు. దీనిని స్త్రీ తన యోనిలో కండోమ్ లాగా ధరించవచ్చు. ఎవరైనా తమ మీద ఎటాక్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఈ డివైజ్ పని చేయడం స్టార్ట్ చేస్తుంది. ఆ మృగం వృషణాలను కట్ చేస్తుంది. డాక్టర్ ఎహ్లర్స్ ప్రతి మహిళ అటాక్ లేకుండా జీవించగలిగే సురక్షితమైన ప్రపంచాన్ని సృష్టించాలని లక్ష్యంగా ముందుకు సాగుతుంది. కాగా ఇందుకు సంబంధించిన న్యూస్ వైరల్ అవుతుండగా.. భారతదేశానికి ఈ పరికరం అవసరం చాలా ఉందని అంటున్నారు నెటిజన్లు. ఇండియాలో అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు.

Next Story