AI-ROBOTS : మానవులపై రోబోల ఆధిపత్యం.. మనుషులను జూలో బంధిస్తాయా?

by Sujitha Rachapalli |
AI-ROBOTS : మానవులపై రోబోల ఆధిపత్యం.. మనుషులను జూలో బంధిస్తాయా?
X

దిశ, ఫీచర్స్ : టెస్లా అధినేత, బిలియనీర్ ఎలన్ మస్క్ ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి హెచ్చరికలు జారీ చేశాడు. ఇప్పటికే పెరిగిపోతున్న AI కల్చర్ మానవాళికి ముప్పుగా పరిణమించే అవకాశం ఉందని తెలిపాడు. మానవులందరి తెలివిని కలిపినా AI ముందు సరిపోరని.. త్వరలోనే ఈ ఫలితాన్ని చూస్తారని అన్నాడు. కానీ నిజంగా AI విలువలు, నిజానిజాలతో వర్క్ చేయగలదా అన్నదే ఇక్కడ అసలు ప్రశ్న. ఇప్పటికే డీప్ ఫేక్ వీడియోలు హల్ చల్ చేస్తుండగా.. ఫోటో నుంచి వీడియో డెవలప్మెంట్స్... న్యూస్ రీడింగ్... హ్యాండ్ రిటెన్ కాపీయింగ్.. ఇలా అన్నింటా వినియోగించబడుతుంది. కాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో డెవలప్ చేసిన లేటెస్ట్ టెక్నాలజీ, దాని వినియోగం గురించి తెలుసుకుందాం.

ఆటోమేటెడ్ రోబోలతో ఇండస్ట్రియల్ ఆటోమేషన్‌లో మాన్యుఫాక్చరింగ్ రిషేప్ జరుగుతుంది, చైనా, జపాన్, దక్షిణ కొరియా, జర్మనీ, యునైటెడ్ స్టేట్స్ వంటి దేశాలు అధునాతన రోబోటిక్‌లను అమలు చేయడంలో ముందున్నాయి. రోబోలు ఇప్పటికే కొన్ని దేశాలలో ఆధిపత్య శక్తిగా ఉన్నాయి. ఈ దేశాలు ఆటోమేషన్‌లో భారీగా పెట్టుబడులు పెట్టాయి, వేగంగా మారుతున్న ప్రపంచ మార్కెట్‌లో పోటీతత్వాన్ని జోడిస్తూ.. తయారీ రంగాలలో ఉత్పాదకత, ఖచ్చితత్వం, కార్యాచరణ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచడానికి వీలు కల్పిస్తాయి.

స్వీడన్

20, 580 రోబోలు

స్విట్జర్లాండ్

23, 680

కెనడా

35, 640

ఫ్రాన్స్

54,000

ఇటలీ

87, 600

జర్మనీ

2, 90, 500

USA

3, 42, 000

AI డాక్టర్ ఆఫీసు...

యూఎస్ కు చెందిన ఫార్వర్డ్ హెల్త్ స్టార్టప్ ప్రపంచంలోనే తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డాక్టర్ ఆఫీసును లాంచ్ చేసింది. కేర్ పోడ్స్ గా పిలవబడుతున్న వీటిని మాల్స్, ఆఫీసు బిల్డింగ్స్ లాంటి ప్రాంతాల్లో పెడుతారు. AI ద్వారా నడపబడుతున్న ఈ పోడ్స్ యూజర్లను సెల్ఫ్ గా హెల్త్ టెస్ట్ చేసుకునేందుకు అనుమతిస్తుంది. మెడికల్ స్టాఫ్ లేకుండానే

బ్లడ్ కలెక్ట్ చేయడం, బీపీ చెక్ చేయడం లాంటివి చేస్తుంది. వెంటనే రిజల్ట్స్ ఇచ్చి.. ప్రిస్క్రిప్షన్ కూడా అందిస్తుంది. ఇందుకోసం నెలకు దాదాపు రూ. 8000 చెల్లించాల్సి ఉంటుంది. 100 మిలియన్ డాలర్ల ఫండింగ్ తో స్టార్ట్ అయిన ఈ కంపెనీ.. ఏడాదిలో 3,200 కేర్ పోడ్స్ సెట్ చేయడమే లక్ష్యంగా పని చేస్తుంది.

మిలిటరీ యుద్ధాల్లోనూ ఏఐ?

భవిష్యత్తులో మిలిటరీ వార్స్ లోనూ AI తన ఆధిపత్యాన్ని చలాయించబోతుందని అంచనా వేస్తున్నారు నిపుణులు. పెంటగాన్ ఇటీవల సిమ్యులేటెడ్ ఎయిర్ కంబాట్‌లో మానవ పైలట్‌తోపాటు AIని పరీక్షించింది. AI- కంట్రోల్డ్ X-62A రోబోటిక్ జెట్ హ్యూమన్-పైలట్ F-16 కంటే మెరుగైన పనితీరును కనబరిచింది.

కృత్రిమ వర్షం...

అరిడ్ జిన్‌జియాంగ్ ఉయ్‌గుర్ అటానమస్ రీజియన్‌లో హైటెక్ TB-A డ్రోన్‌లను ఉపయోగించి చైనా ప్రతిష్టాత్మకమైన క్లౌడ్-సీడింగ్ ట్రయల్‌ను ప్రారంభించింది. ఈ డ్యూయల్- యూజింగ్ డ్రోన్‌లు... గతంలో నిఘా కోసం మోహరించబడ్డాయి. ప్రస్తుతం హమీలోని కరువు పీడిత డోంగ్టియన్ పర్వత ప్రాంతంలో వర్షపాతాన్ని ప్రేరేపించడానికి దీనికే వెండి ఐయోడైడ్ రాడ్‌లను అమర్చారు. ఈ 45-రోజుల ట్రయల్ వాతావరణ మార్పు కోసం మానవరహిత వైమానిక వాహనాల వినియోగంలో భారీ పురోగతిని సూచిస్తుంది. ఈ ప్రాంతాన్ని పీడిస్తున్న తీవ్రమైన నీటి కొరతను తగ్గించడమే లక్ష్యంగా పని చేస్తుంది.

ఫిజికల్ యాక్టివిటీ..

Google DeepMind కు చెందిన AI రోబోట్ ఇప్పుడు మానవుడి మాదిరిగానే టేబుల్ టెన్నిస్ ఆడగలిగే స్థాయికి చేరుకుంది. ఈ డెవలప్మెంట్ క్విక్ రియాక్షన్స్, ఖచ్చితమైన కదలికలు అవసరమయ్యే ఫిజికల్ యాక్టివిటీని మాస్టరింగ్ చేయడంలో AI సామర్థ్యాలను పెంచుతుంది.

మనం జంతువులమే..

Gmail క్రియేటర్ పాల్ బుచ్చేయిట్ ప్రపంచ దేశాలకు మాస్ వార్నింగ్ ఇచ్చాడు. AI రేస్ లో చైనా ముందున్నట్లయితే.. మనుషులను జంతువులను జూలో బంధించినట్లు బంధిస్తుందని హెచ్చరించాడు. ఇది లైఫ్ టైం లాక్ డౌన్ అవుతుందని.. బయటకు వచ్చే ఛాన్స్ ఉండదని అభిప్రాయపడ్డాడు. అంతెందుకు మన ఆలోచనలు కూడా నియంత్రించబడుతాయని, సెన్సార్ చేయబడతాయని చెప్పాడు. కానీ నిజంగా AI ఇంత చీకటి మార్గంలోకి తీసుకెళ్తుందా లేక మనమే ఎక్కువ భయపడుతున్నమా?

Advertisement

Next Story

Most Viewed