వింత వ్యాధితో బాధపడుతున్న యువతి.. స్నానం చేసిందో అంతే సంగతి..

by Sumithra |   ( Updated:2024-03-06 05:12:19.0  )
వింత వ్యాధితో బాధపడుతున్న యువతి.. స్నానం చేసిందో అంతే సంగతి..
X

దిశ, ఫీచర్స్ : ప్రపంచంలోని ఎంతో మంది ప్రజలు అనేక రకాల అలర్జీలతో బాధపడుతున్నారు. కొంతమందికి దుమ్ము, మట్టి కారణంగా ఎలర్జీలు వస్తుంటాయి. మరికొందరికి పాల ఉత్పత్తులు తాగినా తిన్నా, వేరుశెనగలు తిన్నా ఎలర్జీలు వస్తుంటాయి. అయితే నీటి అలర్జీ ఉన్నవారు కూడా ఉంటారని మీరు ఎప్పుడైనా విన్నారా అంటే వినలేదనే చెబుతాం. కానీ అమెరికాలోని సౌత్ కరోలినాకు చెందిన ఓ యువతి ఇలాంటి అరుదైన ఎలర్జీతో బాధపడుతోంది. తలస్నానం చేస్తే చాలా బాధలు పడాల్సి వస్తోందని ఆ యువతి పేర్కొంది. భరించలేని నొప్పితో పాటు శరీరం పై ఎర్రటి దద్దుర్లు కూడా కనిపిస్తాయట.

nypost ప్రకారం ( 22) ఏళ్ల లారెన్ మోంటెఫుస్కో ఆక్వాజెనిక్ ఉర్టికేరియాతో బాధపడుతున్నారు. ఇది ఒక రకమైన చర్మ వ్యాధి. ఈ వ్యాధి చాలా అరుదుగా వస్తుంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి కేసులు ఇప్పటివరకు 37 మాత్రమే నమోదయ్యాయని చెబుతున్నారు. లారెన్ పొరపాటున స్నానం చేసినా లేదా నీటిలో ఆడుకున్నా ఆమె శరీరం మొత్తం ఒక గంట పాటు దురదగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

ఇక ఈ విషయం గురించి లారెన్ మాట్లాడుతూ శరీరం నుంచి వచ్చే చెమట కూడా తనకు ప్రాణాంతకం అని తెలిపారట. ఎందుకంటే ఎక్కడ చెమటలు పడితే అక్కడ ఎర్రటి దద్దుర్లు రావడం ఎంతో బాధను మిగిలిస్తుందని తెలిపారట. యువతిగా తన జీవితం కష్టంగా మారిందని లారెన్ చెప్పారు. తను తన శరీరాన్ని గోకకుండా ఉండేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తుంటానని, కానీ ఆమె శరీరం మీద ఏర్పడే దురద ఆపుకోలేకపోతున్నానని తెలిపారు.

లారెన్ 12 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు, ఆమెకు ఈ వ్యాధి వచ్చిందని నిపుణులు తెలుపుతున్నారు. ఆ తర్వాత నొప్పి పెరుగుతూ వచ్చిందట. 15 సంవత్సరాల వయస్సులో ఆమె మొదటిసారిగా వైద్యులకు తన సమస్యను చెప్పేందుకు వెళ్లిందట. ఆమెను పరీక్షించిన వైద్యులు ఆక్వాజెనిక్ ఉర్టికేరియా అనే అరుదైన వ్యాధితో తాను బాధపడుతున్నారి తెలిపారట. ఈ వ్యాధికి ఇంకా నివారణ లేదు కాబట్టి, లారెన్ వీలైనంత వరకు నీటికి దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తుంది. అయితే ఒక వ్యక్తి స్నానం చేయకుండా ఎన్ని రోజులు జీవించగలడు ? అందుకే లారెన్ బాడీ వైప్‌లను ఉపయోగిస్తుంది. అంతే కాదు ఆమె బట్టలు కూడా త్వరగా మార్చవలసి ఉంటుందట.

Read More..

రోజూ పైనాపిల్ తీసుకుంటే ఈ సమస్యలకు చెక్ పెట్టొచ్చు

Advertisement

Next Story

Most Viewed