- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పిల్లికే ఇలా చేస్తే ఇక పిల్లగాడికి ఎంత చేస్తుందో..? ఔరా అనిపిస్తున్న ఆంటీ కథ!
దిశ, ఫీచర్స్ : ప్రపంచంలోని జంతుప్రేమికులు ఎక్కువగా పిల్లి, కుక్కను పెంచుకుంటూ ఉంటారు. వాటిలో కుక్కలను ఎక్కువ శాతంలో పెంచుకుని, పిల్లులను కాస్త తక్కువగా పెంచుకుంటారు. ఎందుకంటే ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో పిల్లులను చెడ్డ శకునంగా భావిస్తారు. వారు పెంచుకునే పెంపుడు జంతువులను తమ ఇంట్లో పిల్లలతో సమానంగా చూసుకుంటూ వాటికి కావలసిన అన్ని సౌకర్యాలను కల్పిస్తారు. అయితే ఏ జంతువు మెయింటనెన్స్ అయినా 3, 4 వేలు దాటి ఉండదు. కానీ ఓ పిల్లిని పెంచుకునే యజమాని మాత్రం దాని కోసం నెలకు సుమారుగా రూ. 91 వేలను ఖర్చు చేస్తున్నారట. వింటుంటే ఆశ్చర్యంగా ఉంది కదా.. మరి ఆ పిల్లికి ఎందుకు అంత ఖర్చు చేస్తున్నారు పూర్తివివరాలు తెలుసుకుందాం..
డెన్మార్క్‌లోని కోపెన్‌హాగన్ లో ఫెంజా మోగెన్‌సెన్ అనే మహిళ జీవిస్తున్నారు. ఆమె పెంచుకుంటున్న పిల్లి గురించిన విషయాలను సోషల్ మీడియాలో తన మిత్రులకు ఈ విధంగా పంచుకుంది. ఆమెకు చిన్నప్పటి నుంచి పిల్లులంటే చాలా ఇష్టమని తెలిపింది. పిల్లులను ఎక్కడ చూసినా ఆమె పరవశించిపోతుందట. దాదాపు 10 సంవత్సరాల క్రితం అంటే 2013లో ఒక వెబ్‌సైట్‌లో రెండు పిల్లులను చూసి వాటిని పెంచుకునేందుకు తీసుకువచ్చిందని చెప్పారు.
ఫెంజా పెంచుకునే పెంపుడు పిల్లులలో మోంటీ అనే పిల్లి ఆరోగ్యం కొంచెం క్షీణించిందని, ఆ తర్వాత దానిని వైద్యుడి వద్దకు తీసుకువెళ్లానని తెలిపారు. అయితే పిల్లి జన్యుపరమైన రుగ్మతతో బాధపడుతుందని చెప్పడంతో తాను ఎంతో బాధపడిందని తెలిపారు. ఆ పిల్లి చెవిటిదని, మూర్ఛ, ఉబ్బసంతో పాటు మధుమేహం సమస్య కూడా ఉన్నాయట. ఈ వ్యాధుల కారణంగా, పిల్లి ఎక్కువ కాలం జీవించదని డాక్టర్ ఫెంజాకు చెప్పారని పేర్కొన్నారు.
అప్పటి నుంచి పిల్లి చికిత్స కోసం ప్రతి సంవత్సరం సుమారుగా 11 లక్షల రూపాయలు అంటే నెలకు దాదాపు 91 వేల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పారట. తాను 4 సంవత్సరాల వయస్సులో పిల్లిని తీసుకున్నానని, ఇప్పుడు తన వయస్సు 14 సంవత్సరాలు అని ఆమె సోషల్ మీడియాలో పేర్కొన్నారు.