డ్రైఫ్రూట్స్‌తో అద్భుతంగా అలంకరించుకున్న మహిళ.. ఆకట్టుకుంటున్న సీమంతం వీడియో

by Anjali |
డ్రైఫ్రూట్స్‌తో అద్భుతంగా అలంకరించుకున్న మహిళ.. ఆకట్టుకుంటున్న సీమంతం వీడియో
X

దిశ, ఫీచర్స్: ఏ చిన్న పార్టీ అయినా అమ్మాయిలు అందంగా ముస్తాబు కావడానికి ఇష్టపడుతుంటారు. లిప్‌స్టిక్ నుంచి చీర కట్టు, నగల వరకు ఎంతో అందంగా రెడీ అయి.. అందరిలో వారే అట్రాక్షన్‌గా నిలవాలని కోరుకుంటారు. స్పెషల్ లుక్ కోసం ఇటీవల కొంతమంది మహిళలు డిఫరెంట్‌గా ఆలోచించి.. నగలను తయారు చేసి అలంకరించుకుంటున్నారు. మహిళలు అందరికంటే విక్షణమైన డిజైన్‌తో కూడిన నగలు ధరించేందుకే ఇష్టపడతారు. తాజాగా ఓ మహిళ తన సీమంతం కోసం భిన్నంగా థింక్ చేసి.. డ్రై ఫ్రూట్స్‌తో నగలను తయారు చేసింది.

అందంగా తయారు కావడంతో పాటు డిఫరెంట్‌ లుక్‌లో అద్భుతంగా కనిపిస్తుంది. పట్టుచీరను కట్టుకుని.. ఒంటి నిండా నగలు ధరించి అక్కడున్నవారందినీ ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. ఎన్నో రకాల జ్యువెలరీలు చూస్తుంటాం. కానీ ఇలాంటి నగలను ఫస్ట్ చూస్తున్నాం, వజ్ర వైడూర్యాలు, మణిమాణిక్యాలు పొదిగిన ఆభరణాలను ధరించే స్తోమత ఎంత మందికి ఉంటుంది? ప్రకృతి ప్రసాదించే వాటిని నగలకు జోడిస్తే.. జాతి రత్నాలైనా చిన్నబోవాల్సిందే. ఈ మహిళ ఆలోచన చాలా బాగుంది. అంటూ నెటిజన్లు తనపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed