- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ట్రెడ్‌మిల్‌పైన డ్యాన్స్ ప్రాక్టీస్..?! ఈ అమ్మాయిలు అదుర్స్ (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్ః జిమ్ లోపల చేసే ఫిట్‌నెస్, వర్కౌట్ వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవడం అందరికీ తెలిసిందే. ఫిట్‌నెస్‌తో పాటు డ్యాన్స్ కలిపి చేసే ఎరోబిక్స్ కూడా ఫేమస్సే. కానీ, ఫిట్‌నెస్ కోసం ఉపయోగించే ట్రెడ్‌మిల్ మీద డ్యాన్స్ చేయడం మాత్రం కాస్త కంగారుపుట్టించే అంశమే. ఇప్పుడు ఈ వీడియోనే ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ట్రెడ్‌మిల్‌పై సక్రమంగా లేకపోతే బొక్కబోర్లపడి నడ్డి విరుగుద్ధి. కానీ, దానిపైన వీళ్లు నడుచుకుంటూ, గర్బా నృత్య ప్రదర్శన చేస్తున్నారు. ఈ మహిళల గుంపు చేస్తున్న డ్యాన్స్ మూవ్స్ వీడియోలు ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో కనిపించాయి. వీడియోలో, 'గర్బే కి రాత్' పాట బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అవుతుంటే, సంప్రదాయ దుస్తులు ధరించిన మహిళలు గర్బాకు డ్యాన్స్ చేస్తూ, సమన్వయంతో వేసే స్టెప్పులతో అదుర్స్ అనిపించారు.
ఇక, నవరాత్రి వేడుకల్లో వేసే గుజరాతీ గర్బా సాంప్రదాయ నృత్యం ఇలా కూడా చేస్తారా అని ఆశ్చర్యపోయేలా చేసింది ఈ వీడియో. గార్బా వరల్డ్ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఈ వీడియో షేర్ చేయగా, నెటిజనుల నుండి మిశ్రమ స్పందనలు వచ్చాయి. అలాంటి వ్యాయామం ప్రమాదకరమని చాలా మంది కామెంట్ చేశారు. "ట్రెడ్‌మిల్‌పైన అలాంటి స్కర్ట్‌లు ధరించడం ఏమాత్రం సురక్షితం కాదు!" అని ఒకరు హెచ్చిరించారు. "అక్కడ క్లాత్ ఇరుక్కుపోయితే ఇంకేమైనా ఉందా..?!" అంటూ మరొకరు అసహనం వ్యక్తం చేశారు.