డైనోసార్లు మ‌ళ్లీ వ‌చ్చాయా..?! నెట్టింట్లో హ‌ల్‌చ‌ల్ చేస్తున్న వీడియో

by Sumithra |   ( Updated:2022-05-09 15:52:15.0  )
డైనోసార్లు మ‌ళ్లీ వ‌చ్చాయా..?! నెట్టింట్లో హ‌ల్‌చ‌ల్ చేస్తున్న వీడియో
X

దిశ‌, వెబ్‌డెస్క్ః మ‌నిషి ప‌రిణామం చెంద‌కముందు భూమి పైన డైనోసార్ల‌నే భారీ జంతువులు ఉండేవ‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతుంటారు. జూరాసిక్ పార్క్ సినిమాతో వాటి రూపమేంటో, శ‌క్తి ఎంతో అంద‌రికీ ఒక అవ‌గాహ‌న కూడా వ‌చ్చింది. అయితే, అవి ఇప్ప‌టి కాలంలో లేవ‌ని అంటుంటారు. కానీ, అవి నిజంగానే భూమి పైన మ‌ళ్లీ ఉద్భ‌విస్తే ప‌రిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి! ఇలాంటి వీడియోనే ఒక‌టి సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. కొన్ని దృశ్యాలు క‌ళ్ల‌తో చూసినా న‌మ్మ‌లేము. ఎందుకంటే, చూపును కూడా మోసం చేసేట‌ట్లుగా ఉంటాయి. ప్ర‌స్తుతం ఈ వీడియో కూడా అంతే. బీచ్‌లో "బేబీ డైనోసార్‌ల" సమూహం ఒక‌టి న‌డుస్తుంది చూడండీ అంటూ ఈ వీడియో వెలుగులోకి వ‌చ్చింది. Buitengebieden ఈ వీడియోను ట్విట్టర్ షేర్ చేశారు. వీడియోలోని జంతువులు నీటి కోసం పరుగెత్తే అపరిపక్వ సౌరోపాడ్ డైనోసార్‌లను పోలి ఉండ‌గా, చాలా మంది ట్విటర్ యూజర్లు దీన్ని చూసి అయోమయంలో పడ్డారు.

"దీనికి నాకు కొన్ని సెకన్ల సమయం పట్టింది" అనే క్యాప్షన్ ఉన్న ఈ వీడియోలో క‌నిపించే జంతువులు డైనోసార్ల సమూహం కాదని కొందరు వెంటనే గుర్తించారు. అయితే, కోటిముండిస్ అని పిలిచే 'కోటిస్‌' అనే జంతువులు ఇవ‌ని అంద‌రికీ తెలియ‌క‌పోవ‌చ్చు. ఇవి ప్రోసియోనిడే కుటుంబానికి చెందినవి. దక్షిణ అమెరికా, మధ్య అమెరికా, మెక్సికో, దక్షిణ అమెరికా సంయుక్త రాష్ట్రాలకు చెందిన జంతువులు. రాత్రి వేళ ఎక్కువ‌గా సంచ‌రిస్తుంటాయి. తల నుండి తోక కొన వరకు, వయోజన కోటిస్ పొడవు 69 సెం.మీ (27 అంగుళాలు) వరకు ఉంటుంది. వీటి తోక వాటి శరీరం అంత పొడవు ఉంటుంది. ఇక‌, రివ‌ర్స్ చేసిన ఈ వీడియోలో కోటీస్ తోక‌లు డైనోసార్ మెడ‌లా క‌నిపించ‌డంతో నెటిజ‌న్లు కొన్ని క్ష‌ణాలు అయోమ‌యానికి గుర‌వుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed