- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అటు ప్రేమ ప్రపోజల్.. ఇటు మూడుసార్లు ఢమాల్..! (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్ః జీవితంలో చాలా విలువైన క్షణాలు చాలా కొన్నే ఉంటాయి. అప్పటి జ్ఞాపకాలు జీవితాంతం గుర్తుండిపోతాయి. అలాంటి ఓ క్షణంలో ఒక యువతి తన సోదరి లవ్ ప్రపోజల్‌కు సంబంధించిన విలువైన క్షణాన్ని క్యాప్చర్ చేయడానికి ప్రయత్నిస్తున్న ఓ పాత వీడియో వైరల్‌గా మారింది. ఏడాది క్రితం ఫేస్బుక్లో షేర్ చేసిన ఈ వీడియో దక్షిణాఫ్రికాలో చిత్రీకరించింది. ఈ క్లిప్‌ను ఫిలిప్ బ్రూవర్ షేర్ చేయగా, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ, ఇంకా నెటిజనుల దృష్టి నుండి దూరం కాలేదు. ఈ వీడియోలో ఒక యువతి తన సోదరి ప్రేమ ప్రతిపాదనను కెమెరాలో రికార్డ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అయితే, ఆ సంతోషంలో, ఉత్సాహంలో ఆమె కింద పడి, పైకి లేస్తూ మూడుసార్లు పడిపోయింది. బీచ్‌లో ఉన్న ఇసుక వల్ల ఆమె ఆ సందర్భంలో అలా జారి పడింది. అయితే, ఆమె కెమెరాలో రికార్డ్ అయిన వీడియో క్లిప్‌ను కూడా బ్రూవర్ షేర్ చేయడం విశేషం. సరదాగా నవ్వించే ఈ వీడియో, అంతకుమించి, మంచి సందర్భాన్ని చూపించే క్లిప్ ఇప్పటికీ లైవ్లీగా నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇక, ఈ యువతి తాను కింద పడిపోతున్నా కూడా తాను చేయగలిగినదంతా రికార్డ్ చేయడానికి ప్రయత్నించిందని చాలా మంది ప్రశంసించారు. "ఓరి దేవుడా! ఆమె మూడోసారి కూడా లేచింది" అని ఒక ఫేస్బుక్ వినియోగదారు అన్నారు.
https://www.facebook.com/648871502/videos/10157632468596503/