మీ పిల్లలు తలనొప్పి వస్తోందని కంప్లైంట్ చేస్తున్నారా?.. పేరెంట్స్ తప్పక తెలుసుకోవాల్సింది ఏంటంటే..

by Javid Pasha |
మీ పిల్లలు తలనొప్పి వస్తోందని కంప్లైంట్ చేస్తున్నారా?.. పేరెంట్స్ తప్పక తెలుసుకోవాల్సింది ఏంటంటే..
X

దిశ, ఫీచర్స్ : సరిగ్గా హోం వర్క్ చేసే సమయంలోనే మీ పిల్లలు తలనొప్పి వస్తోందని ఫిర్యాదు చేస్తున్నారా? అయితే తప్పించుకోవడానికి అలా చేస్తున్నారని మాత్రం నిర్లక్ష్యం చేయకండి. కాస్త ఓపికగా ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే.. పిల్లల్లో వివిధ మూడ్ డిజార్డర్స్‌కు, ముఖ్యంగా తలనొప్పికి ప్రత్యేక కారణాలు ఉండవచ్చు అంటున్నారు మానసిక నిపుణులు. కొన్ని అధ్యయనాలు కూడా అదే పేర్కొంటున్నాయి. మానసిక వేదన, ఆందోళన, బెదిరింపులను ఎదుర్కోవడం వంటివి యుక్త వయస్కుల్లో తలనొప్పికి కారణం అవుతున్నాయని యూనివర్సిటీ ఆఫ్ కాల్గరీకి చెందిన పరిశోధకులు చెప్తున్నారు.

ఎప్పుడో ఒకసారి తలనొప్పి రావడం కామన్.కానీ తరచుగా రావడం వెనుక స్పెషల్ రీజన్స్ ఉండవచ్చు. ఇది తెలుసుకోవడానికి కాల్గరీ యూనివర్సిటీకి చెందిన రీసెర్చర్స్ 23 వేలమంది యుక్త వయస్కులను అబ్జర్వ్ చేశారు. తలనొప్పికి గల కారణాలపై ఎనలైజ్ చేశారు. పరిశోధకుల ప్రకారం వరల్డ్‌వైడ్ 11 శాతం మంది టీనేజర్స్ స్కూల్స్ లేదా బయట ఫ్రెండ్స్ వద్ద, ఇంటి చుట్టు పక్కల నివసించే వ్యక్తులవల్ల ఎదురయ్యే ఇబ్బందులు, బెదిరింపుల కారణంగా ఆందోళన చెడుతున్నట్లు తేలింది. దీనివల్ల బాధిత పిల్లల్లో కొంతకాలానికి తలనొప్పి సమస్య ప్రారంభమైనట్లు గుర్తించారు. ముఖ్యంగా ప్రతి నలుగురిలో ఒకరు బహిరంగ బెదిరింపుల వల్ల తలనొప్పి బారినపడుతున్నారట. ఇక అవమానాలు, ఇంట్లో తరచూ ఫ్యామిలీ గొడవలు, హెచ్చరికల కారణంగా 17 శాతం మంది తలనొప్పితో బాధపడుతున్నట్లు సర్వేను రీసెర్చర్స్ కనుగొన్నారు. అందుకే మీ పిల్లలు వేధింపులకు గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed