బ్రెస్ట్ ఫీడింగ్‌తో టైప్2 డయాబెటిస్‌కు చెక్.. అధ్యయనంలో వెల్లడి

by samatah |   ( Updated:2023-06-16 14:50:53.0  )
బ్రెస్ట్ ఫీడింగ్‌తో టైప్2 డయాబెటిస్‌కు చెక్.. అధ్యయనంలో వెల్లడి
X

దిశ, ఫీచర్స్ : పిల్లలకు బ్రెస్ట్ ఫీడ్ చేయాలా లేక ఫార్ములా పాలు వాడాలా అనే అంశాల విషయంలో సతమతం అవుతుంటారు తల్లులు. కానీ బ్రెస్ట్ ఫీడింగ్ బెటర్ అంటున్నారు పరిశోధకులు. టైప్ 2 డయాబెటిస్‌ను నివారించడంలో తల్లిపాలు కీలక పాత్ర పోషిస్తాయని చెప్తోంది తాజా అధ్యయనం. తల్లిపాలు పాంక్రియాస్‌లో ఇన్సులిన్ కణాల ఉత్పత్తిని మెరుగుపరుస్తాయని, మహిళల్లో ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతాయని, తద్వారా జీవితంలో తరువాతి పరిస్థితికి రక్షణ ఏర్పడుతుందని పరిశోధకులు కనుగొన్నారు.

మహిళలకు సంబంధించిన మునుపటి పరిశోధనలో కూడా బ్రెస్ట్ ఫీడింగ్‌ ఇవ్వడం తల్లీబిడ్డలకు మేలు చేస్తుందని, తల్లుల్లో టైప్ 2 డయాబెటిస్ రాకుండా ఉంటుందని వెల్లడైనట్లు పరిశోధకుడు డాక్టర్ జూలీ హెన్స్ తెలిపాడు. తల్లిపాలు ఇవ్వడం, ఇవ్వకపోవడం వల్ల ఏర్పడే మెటాబాలిక్ ప్రభావాలను పరిశీలించడానికి పరిశోధకులు ఎలుకలపై స్టడీ నిర్వహించారు. వీరు జన్మనిచ్చిన ఆడ ఎలుకలను రెండు సమూహాలుగా విభజించారు. ఒక సమూహం ఎలుకలు తమ పిల్లలకు పాలిచ్చేవి కాగా, మరో సమూహం ఎలుకలు తమ పిల్లలకు పాలివ్వకుండా దూరంగా ఉంచారు. ఒక నెల తర్వాత వాటి ఆరోగ్య పరిస్థితులను అంచనా వేయడానికి టెస్టులు నిర్వహించగా పిల్లలకు పాలివ్వని ఎలుకల్లో మానవులలోని విసెరల్ కొవ్వు మాదిరిగానే ఫ్యాట్ పెరగడం, అది డయాబెటిస్ రిస్కును కలిగి ఉండటం గమనించారు. మనుషుల్లోనూ ఈ రకమైన కొవ్వు డయాబెటిస్ డెవలప్ అయ్యేందుకు కారణం అవుతుందని పరిశోధకులు పేర్కొన్నారు.

Also Read..

పక్కింటి వారి భార్యను దొంగిలిస్తేనే అక్కడి యువకులకు పెళ్లి..

Advertisement

Next Story

Most Viewed