- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెరుగుతున్న మానవ మెదుడు పరిమాణం.. లాభమా?.. నష్టమా?
దిశ, ఫీచర్స్ : మానవ శరీరంలో మెదడు చాలా కీలకమైన భాగం. తెలివితేటలు, జీవన మనుగడ వంటివి దీనిపై ఆధారపడి ఉంటాయని నిపుణులు చెప్తుంటారు. అయితే గత శతాబ్దాలతో పోల్చితే ఇప్పుడు మెదడు పరిమాణంలో మార్పులు వస్తున్నాయని ఒక అధ్యయనంలో వెల్లడైంది. బ్రెయిన్ స్ట్రక్చర్‌లో భాగమైన వైట్ మ్యాటర్, గ్రే మ్యాటర్, హిప్పోకాంపస్ సైజు పెరుగుతోందని నిపుణులు చెప్తున్నారు. గత అధ్యయనాలు దీర్ఘాకాలంపాటు ఆల్కహాల్ సేవనం, ధూమపానం, వాతావరణ కాలుష్యం వంటివి మెదడు పరిమాణం తగ్గడానికి కారణం అవుతాయని పేర్కొన్నాయి. కానీ తాజాగా యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన పరిశోధకుల పరిశోధన మాత్రం మెదడు సైజు పెరుగుతూ వస్తోందని తేల్చింది. జామా న్యూమరాలజీ ఇంటర్నేషనల్‌లో ఈ అధ్యయన వివరాలు ఉన్నాయి.
అధ్యయనంలో భాగంగా పరిశోధకులు 1930 నుంచి 1970 సంవత్సరాలలో పుట్టిన వ్యక్తుల బ్రెయిన్ స్ట్రక్చర్లను పరిశీలించారు. ఇందుకు సంబంధించిన అంతర్జాతీయ డేటాను విశ్లేషించారు. కాగా 1930లో పుట్టిన వారితో పోల్చితే 1970లో పుట్టినవారి బ్రెయిన్ సైజ్ 6.6 శాతం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అలాగే 1999 నుంచి 2019 మధ్య కాలంలో 3, 226 మంది మెదడు సంబంధించిన ఎంఆర్ఐ స్కాన్లను కూడా ఎనలైజ్ చేశారు. దీని ప్రకారం కూడా1930లో పుట్టిన వారి మెదడు యావరేజ్‌గా 1,234 మిల్లీలీటర్లు ఉండగా, 1970లో పుట్టినవారి మెదడు 1,321 మిల్లీ లీటర్లు ఉన్నట్లు కనుగొన్నారు. ఇక పెరుగుదలకు సంబంధించిన మెదడు నిర్మాణ ప్రాంతాలను పరిశీలించినప్పుడు వైట్ మ్యాటర్, గ్రే మ్యాటర్, హిప్పో కాంపస్ సైజులు పెరిగాయి. అయితే ఇలా మెదడు పరిమాణం పెరగడం వల్ల నష్టం లేదని, పైగా మతిమరుపు, డెమెన్షియా వంటి రిస్కు తగ్గడంవల్ల మనుషులకు ఒక విధంగా లాభం జరుగుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.