- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మనస్పూర్తిగా ఏడవాలనుకుంటున్నారా.. ఈ పార్లర్ కి వెళితే చాలు ఏడువు వద్దన్నా వస్తుంది..
దిశ, ఫీచర్స్ : సాధారణంగా మనిషి జీవితంలో ఏడుపు, నవ్వు సాధారణం. ఒక్కోసారి మనుషుల జీవితంలో సంతోషం వచ్చినప్పుడు ఆనందంగా నవ్వడం మొదలుపెడతారు. కొన్నిసార్లు దుఃఖం వచ్చినప్పుడు మనుషులు బాధపడతారు. అలాంటప్పుడు వాళ్ల కళ్లలో నీళ్లు వస్తూ ఉంటాయి. అయితే కొన్నిసార్లు ప్రజలు ఏవో పాత విషయాలను గుర్తు తెచ్చుకున్నప్పుడు లేదా ఏదైనా సంఘటన జరిగినప్పుడో ఏడవాలనుకుంటారు. కానీ వారు ఏడిచే సమయంలో ఇతరులు ఎవ్వరూ చూడకూడదనుకుంటారు. అలాంటప్పుడు ఎవరూ లేని గదిలో కూర్చుని ఏడవడమో, బాత్రూంలో కూర్చుని ఏడవడమో చేస్తూ ఉంటారు. అయితే అలాంటి వారికోసం అమెరికాలో ఒక వ్యక్తి ఈ సమస్యకు పరిష్కార మార్గాన్ని కనుగొన్నాడు. ఆ పరిష్కార మార్గం ఏంటి అనుకుంటున్నారా. మరి ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఓ ప్రత్యేకమైన పార్లర్ అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ప్రారంభించారు. దీని పేరు 'సోబ్ పార్లర్'. ఈ పార్లర్‌లో ఒక ప్రైవేట్ క్రై రూమ్ ను నిర్మించారు. ఎవరైనా సరే ఇక్కడ ఏడ్చే సౌకర్యం అందుబాటులో ఉంది. బాధలో ఉన్నవారు ఈ గదిలోకి వెళ్లి మనస్పూర్తిగా ఏడ్వవచ్చని వారి హృదయాన్ని తేలికపరచవచ్చని చెబుతున్నారు. న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం ఈ ప్రత్యేకమైన పార్లర్‌ను గత సంవత్సరం ఆంథోనీ విలోట్టి అనే వ్యక్తి ప్రారంభించాడు.
ఒత్తిడితో సతమతమవ్వడం..
ప్రస్తుతం చాలా మంది ఒత్తిడి సమస్యతో సతమతమవుతున్నారని ఆంటోనీ చెప్పారు. కొంతమంది ఇంట్లో సమస్యల వల్ల ఒత్తిడికి గురవుతారు. మరికొందరు ఆఫీసు ఒత్తిడితో బాధపడుతుంటారు. అదే సమయంలో కొంతమంది తమ సంబంధాల కారణంగా ఒత్తిడికి గురవుతారు. అలాంటప్పుడు వారికి ఏడవాలనిపిస్తుంది. ఎందుకంటే ఏడుపు గుండెను తేలికపరుస్తుంది. ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుందని శాస్త్రవేత్తలు కూడా అంటున్నారు. ఇలా ఆలోచిస్తూ ఆంథోనీ ఈ పార్లర్‌ను తెరిచాడు. ఒత్తిడితో బాధపడుతున్న వ్యక్తులు మాత్రమే తన సోబ్ పార్లర్‌కు వస్తారని, ముఖ్యంగా ఇంట్లో లేదా ఆఫీసులో ఒత్తిడితో బాధపడుతున్న వారు లేదా చెడు సంబంధాల కారణంగా ఒత్తిడికి గురైన వారు మాత్రమే వస్తారని ఆయన చెప్పారు.
గదిలోని వస్తువులు కన్నీళ్లు తెప్పిస్తాయి..
కొన్ని నివేదికల ప్రకారం, సోబ్ పార్లర్‌లోని క్రై రూమ్‌లో, కన్నీటి ఆకారపు అద్దాలు, దిండ్లు వంటి కన్నీళ్లు తెప్పించే వస్తువులు కనిపిస్తాయి. అలాగే భావోద్వేగ పాటలు కూడా ఇక్కడ వినవచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత కొందరికి 10 నిమిషాలు ఏడ్చిన తర్వాతే ఓదార్పు లభిస్తుందని, మరికొంత మందికి కొంచెం ఎక్కువ సమయం పడుతుందని ఆంథోనీ చెప్పారు. సోబ్ పార్లర్ వాతావరణం ఏడ్చేలా ఉందని ప్రజలు కూడా అంటున్నారు.