Snake suicide: ఆత్మహత్య చేసుకున్న పాము.. ఎంత కష్టం వచ్చిందో పాపం!

by Javid Pasha |
Snake suicide: ఆత్మహత్య చేసుకున్న పాము.. ఎంత కష్టం వచ్చిందో పాపం!
X

దిశ, ఫీచర్స్ : జీవితం మీద విరక్తి, అప్పుల బాధ, ప్రేమలో వైఫల్యం.. ఇలా రకరకాల కారణాలతో వ్యక్తులు సూసైడ్ చేసుకున్న వార్తలు మీరు ఏదో ఒక సందర్భంలో మీరు వినే ఉంటారు. జంతువులు లేదా పాములు కూడా అలా చేసుకుంటాయని ఎప్పుడైనా విన్నారా? అదెలా సాధ్యం? అనిపిస్తుంది కదూ.. కానీ అలాంటి న్యూస్ ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. అందుకు సంబంధించిన ఫొటోలను ఓ వ్యక్తి షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి.

ఓ రెడ్డిట్ యూజర్ పాముకు సంబంధించిన రెండు ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఇందులో పాము తన తోకతో తాను మెడను చుట్టేసుకొని గట్టిగా నొక్కుకుంటోంది. ఈ కారణంగానే ఆ పాము 10 నిమిషాల తర్వాత చనిపోయిందని సదరు వ్యక్తి పేర్కొన్నాడు. భావోద్వేగాలు, బాధలు, ఆపదలు మనుషులనే కాదు, చివరికి విష సర్పాలను కూడా కలచివేస్తాయనేందుకు ఇది ఉదాహరణ అంటూ ఆ వ్యక్తి పేర్కొనగా.. నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. పాము ఆత్మ హత్య చేసుకుంటుంటే మరి మీరేం చేస్తున్నారని కొందరు ప్రశ్నించగా.. అది సూసైడ్ చేసుకుంటూ ఉంటే పది నిమిషాలు అక్కడే ఉండి ఫొటో తీసేబదులు దానిని కాపాడలేకపోయారా? అంటూ మరో వ్యక్తి కామెంట్ చేశాడు. ప్రజెంట్ ఈ ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

Yesterday I found a snake which was strangling himself, after 10 minutes he died byu/FrontalisUtkozes ininterestingasfuck

Advertisement

Next Story

Most Viewed