ఆ ఐదు అలవాట్లే దెబ్బతీస్తున్నాయి.. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్‌పై తాజా అధ్యయనం

by Javid Pasha |
ఆ ఐదు అలవాట్లే దెబ్బతీస్తున్నాయి.. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్‌పై తాజా అధ్యయనం
X

దిశ, ఫీచర్స్ : మన రోజువారీ అలవాట్లు కూడా గట్ హెల్త్‌ను ప్రభావితం చేస్తాయని, సానుకూల, ప్రతికూల జీవన విధానానికి కారణం అవుతాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ముఖ్యంగా కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం, అజీర్తి, పేగుల్లో మంట లేదా దురద వంటి సమస్యలతో కూడిన ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ డెవలప్ అవడంలో చాలా వరకు బ్యాడ్ హాబిట్స్ కీ రోల్ పోషిస్తున్నాయని యూకే బయోబ్యాంక్ సెంట్రల్‌కు చెందిన పరిశోధకులు కనుగొన్నారు.

10 శాతం మందిలో అదే ప్రాబ్లం

ప్రపంచ వ్యాప్తంగా జనాభాలో 10 శాతం మందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యల్లో ప్రస్తుతం ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ (ఐబీఎస్) కూడా ఒకటిగా ఉందని రీసెర్చర్స్ చెప్తున్నారు. దీనికి కచ్చితమైన కారణాలు మరిన్ని తెలియాల్సి ఉన్నప్పటికీ, చాలా వరకు ఈ రుగ్మతను అనుభవించేవారి బాధాకరమైన లక్షణాలకు క్రమ రహిత గట్-బ్రెయిన్ కనెక్షన్ కారణమని వారు గుర్తించారు. అధ్యయనంలో భాగంగా శాస్త్రవేత్తలు హెల్తీ లైఫ్‌స్టైల్ బిహేవియర్స్, అలాగే అన్‌హెల్తీ లైఫ్ స్టైల్ బిహేవియర్స్ కామన్ డైజెస్టివ్ డిజార్డర్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్‌ను పెంచడంలో, నివారించడంలో ఎలా సహాయపడతాయో అబ్జర్వ్ చేశారు.

ఈ అలవాట్లే అసలు కారణం

ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ప్రభావాన్ని తెలుసుకునే క్రమంలో 12.5 సంవత్సరాల యావరేజ్ ఫాలో అప్ వ్యవధిలో పరిశోధకులు 64,286 మందిని పరిశీలించారు. ఈ సమయంలో 961 మంది పార్టిసిపెంట్స్ ఐబీఎస్‌ను డెవలప్ చేసినట్లు గుర్తించారు. అందుకు కారణాలను విశ్లేషించగా తరచూ ధూమపానం చేయడం, ఐదు గంటలకంటే తక్కువగా నిద్రపోవడం, ఫిజికల్ యాక్టివిటీస్‌లో పాల్గొనకపోవడం, ఆల్కహాల్ సేవనం, సమతుల్య ఆహారం తినకపోవడం వంటి కారణాలే ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్‌కు దారితీస్తున్నట్లు వెల్లడైంది. అయితే బాధితులు ఈ అలవాట్లను మానుకొని, ఆరోగ్యకరమైన జీవన శైలిని అవలంభించినప్పుడు ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఇబ్బందులు 42 శాతం తగ్గినట్లు గమనించారు. అందుకే రోజువారీ చెడు అలవాట్లను మానుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed